YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మరణమృదంగం

Highlights

  • సండే.. సందడే.. సందడి..
  • వారం ఆరంభమే...
  • పద్మ'శ్రీ'దేవి మరణవార్త
  • చూస్తే 2. కి.మీ. వెళితే 70. కి.మీ.లు
  • ‘విశాఖ ఉక్కు’ పేరు మార్చడం అవసరమా.?
  • ఆంధ్రజ్యోతి ప్రభుత్వమట!
  • మంచి కథనం:
మరణమృదంగం

వారం ఆరంభమే...పద్మ'శ్రీ'దేవి మరణవార్తతో మరణమృదంగం మొదలైంది.ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగానే మరో శరాఘాతం. కంచి కామకోటి పీఠం 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి 'శివైఖ్యం' పొంది బృందావన ప్రవేశం చేశారు. ప్రముఖ రచయిత నాయుని కృష్ణమూర్తి తిరుపతి నుంచి జరిగిపోయారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది... ఇలా అన్ని పత్రికలలో వరుసగా పతాక శీర్షికలన్నీ మరణమృందంగం వినిపించాయి.
చావులోనూ అసమానత్వమే! అంటూ 'ప్రజాశక్తి / నవ తెలంగాణ' సంపాదకీయం ఆలోచింపజేసింది.
వెండి'తెర'పై శుక్ర,శనివారాలు 'బొమ్మ' ఆడలేదు. దీంతో సగటు సినీ అభిమాని అల్లాడి పోయాడు.

మరణమృదంగంతో...
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు....
చంద్రబాబు "40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ" కథనం, 
'సాక్షి' లో జగన్ 100రోజుల పాదయాత్ర వార్తలకు 'మేకప్ టేస్ట్' పోయింది.
సుబాబుల్  రైతు ఉద్యమం పై 'వార్త' వరుస కథనాలు ఇవ్వగా 'తలారి'గా మారిన దళారి అంటూ న్యూస్ పేజీ ఫినిషింగ్ టచ్ ఇచ్చింది.
రాయలసీమలో హైకోర్టు డిమాండ్ ఊపందుకుంది.
ఇంటర్ పరీక్షలు ప్రారంభమైయ్యాయి. ప్రభుత్వం అక్రమాలను నిరోధించలేక  తన చేతగాని తనం కప్పిపుచ్చడం కోసం
'ఒక నిమిషం నిబంధన' పెట్టి ఎందరి కన్నీళ్ళకు కారణమౌతుంది.
నాన్న..నోరుజారితే కూతురు.. సర్దేసింది.
నాన్న నోరుజారితే..
కూతురు సర్ది చెప్పింది. 
తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. సహజసిద్ధ శైలితో ప్రధాని గురించి మాట్లాడిన దానికి బా.జా.పా నొచ్చుకుంది. చెల్లి కవితమ్మ వారిని ఓదార్చి సర్దుకోమంది.
సందట్లో సడేమియాలా... కే.టి.ఆర్.ను కాంగ్రెస్ 'బచ్చా'అనడం.. ఆయన ఫైర్ కావడం పాఠకులకు 'రాజకీయ వినోదం' మిగిల్చింది.
ఎప్పుడో దొరికాడు.. ఇప్పుడు చెప్పారు..
ఎట్టకేలకు జర్నలిస్ట్ గౌరీ లంకేష్ కేసులో నిందితుడు దొరికాడు. ఆ కాషాయ వార్త ఆలస్యంగా ప్రభుత్వం బయటపెట్టడంతో హత్య వెనుక ఎవరున్నారనేది స్పష్టమైంది.
పత్రికలకు అందని వార్తలు:

చూస్తే 2. కి.మీ. వెళితే 70. కి.మీ.లు
కృష్ణా జిల్లాలో చందర్లపాడు మండలం ఏటూరు పరిధిలోని లంక గ్రామాలు. గుంటూరు జిల్లా అమరావతి పరిధిలోని గ్రామాలు. రెండింటిని విడదీస్తూ పారే కృష్ణమ్మ. ఈ గ్రామాల మధ్య నిత్యం పడవ ప్రయాణాలు కొనసాగేవి. పడవ ప్రయాణం ద్వారా దూరం 2 కిలోమీటర్లు మాత్రమే.
అయితే ఇటీవల ఫెర్రీ బోట్‌ ప్రమాదం జరగడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా పడవ ప్రయాణాలు రద్దు చేశారు. 
దీంతో కనుచూపు మేరలో కనిపించే కృష్ణానది ఆవలి ఒడ్డు ప్రయాణం దూరం 70కి.మీ.లకు పెరిగింది.
అధికారులు ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు చేయాలిగాని అసలు పడవలే వడవకుండా నిషేధం విధింఛడం విడ్డూరమే... నాయనా నారా చంద్రబాబూ... జర ఈ సంగతేంటో ఒకసారి చూడు మరి.
‘విశాఖ ఉపేరు మార్చడం అవసరమా.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ఉంటూక్కు’ విశాఖ కీర్తి పతాకను ఎగరేస్తున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ పేరును మార్చడం తగదని కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇలాగే పేరు మార్చడానికి 1983లో నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు సాగించినప్పుడు..అది తగదని విశాఖ ఉక్కు సత్యాగ్రహి టి.అమృతరావు నిరాహార దీక్ష చేపట్టారు. దాంతో నాటి ముఖ్యమంత్రి భవనం వెంకట్రామిరెడ్డి, విశాఖపట్నం స్టీలుప్లాంట్ పేరు మార్చబోమని హామీ ఇచ్చి అమృతరావుతో దీక్ష విరమింపజేశారు. నాటి నుంచీ సంస్థ పేరు యథాతధంగా కొనసాగుతూ వస్తోంది. మళ్లీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నా... స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ స్పందించక పోవడం దారుణం. దేశంలోని వివిధ స్టీలుప్లాంట్లు ఆయా ప్రాంతాల పేరుతోనే కొనసాగుతుంటే, విశాఖ ఉక్కుపై ఈ వింత పోకడ ఏమిటి..?

పొరపాటున..
‘ఆంధ్ర జ్యోతి' ప్రభుత్వమట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం ఓ తెలుగు పత్రిక వార్తా ఏజెన్సీకి అప్పగించడం జరిగింది.
‘ఫలానా పత్రిక ఏజెన్సీ ద్వారా’ అంటూ పత్రికలకు అందే సమాచారంలో తెలియజేస్తారు.
పిభ్రవరి 27న (మంగళవారం) కడప జిల్లా సమాచార శాఖ ద్వారా అందిన దేవాదాయ శాఖ ప్రెస్‌నోట్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం’ అని ఉండాల్సిన చోట ‘ఆంధ్ర జ్యోతి ప్రభుత్వం’అని ఉండటం గమనార్హం.

మంచి కథనం:
అమ్మ వంట మనిషి.. కూతురేమో శాస్త్రవేత్త 
పట్టుదలతో ఉన్నతంగా ఎదిగిన దేవరాపల్లి యువతిపై 'ఈనాడు' కథనం బాగుంది.
నిలదీసి ప్రాంతీయ మీడియా
సమర్థించిన జాతీయ మీడియా
'న్యూస్ పేజీ' అందించిన పద్మ'శ్రీ'దేవికి పరాభవం అంటూ పద ప్రయోగం చేస్తూ, భారతీయ దౌత్య అధికారుల వైఫల్యాలను ఎత్తి చూపిన కథనం, 'ఇండియా టుడే' ఆంగ్ల అనువాదం ఆకట్టుకుంది.
ఆకర్శించిన శీర్షికలు:
రొట్టెకు పెద్దపీట.. మాంసానికీ ఎక్కువ వాటా
తేలని టెం‘డర్‌’
రోడ్డుకు రాజకీయ గ్రహణం 
కన్ను మూస్తున్నా..... కళ్లు తెరవరేం..
'తలారి'గా మారిన దళారి
కొసమెరుపు:
ఐ.పి.ఎస్. అధికారి రంగనాథ్ పై ఖమ్మంలో జరిగిన న్యాయవిచారణ నివేదిక ఓ జర్నలిస్ట్ చేజిక్కించుకున్నారు. మరి అది ఏ రూపంలో ఏక్కడ ఏవిధంగా 'పేలుతుంది' భవిష్యత్తులో తెలుస్తోంది.
                                                                  -- విశ్లేషణ: అనంచిన్ని వెంకటేశ్వరరావు,9440000009.

Related Posts