యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆదోని పట్టణ శివారు ఆస్పరి రోడ్డు సమీపంలో మంగలి బసవరాజ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకి వెళ్తే మంగలి బసవరాజ్(42) కు భార్య సువర్ణతో పాటు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇతడు కులవృత్తి తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కుడా చేసేవాడు. ఏమి జరిగిందో తెలియదు కాని దారుణ హత్యకు గురయ్యాడు. అందరితో సరదాగా ఉండే బసవరాజుకు శత్రువులు కూడా ఎవరు లేరని సన్నిహితులు తెలియచేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో అంచలంచెలుగా ఎదగాలనుకున్నాడు . కానీ అంతలోపే దారుణ హత్యకు గురి అయ్యాడు. దుండగులు అతని వంటి పై పెట్రోల్ పోసి నిప్పు అంటించి హత్యచేసి పరారయ్యారు.