YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీలో మాటల యుద్ధం లోకేష్ పై సెటైర్లు

అసెంబ్లీలో మాటల యుద్ధం లోకేష్ పై సెటైర్లు

శని, అదివారం సెలవు దినాలు కావడంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి శుక్రవారం ప్రసగించిన విషయం తెలిసిందే. కాగా, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక మంగళవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. గవర్నర్‌ ప్రసంగంపై తీర్మానం ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ తమ్మినేని సీతారాం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ గురించి మాట్లాడిన అనంతరం సమావేశాలను స్పీకర్‌ సభను ప్రారంభించారు. ఈ ఎన్నిక కోసం సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కాగా ఉప సభాపతి పదవికి గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పేరును సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాబట్టి మంగళవారం ఉదయం ఆయన ఎన్నిక లాంఛనమే అని భావించవచ్చు. ఈ నేపథ్యంలో శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం చర్చ జరుగుతోంది. ఈ తీర్మానాన్ని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదోర ప్రవేశపెట్టగా, ప్రభుత్వ విప్‌ ముత్యాలనాయుడు బలపరిచారు. అనంతరం విప్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు పూర్తి విశ్వాసం, నమ్మకంతో సీఎం జగన్‌ను గెలిపించారని పేర్కొన్నారు. ప్రజల నమ్మకం, విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తామమని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జగన్‌ మంత్రివర్గంలో స్థానం కల్పించారని, ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం రివర్స్‌ టెండరింగ్‌, అమ్మ ఒడి కింద మహిళలకు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం చేస్తామని ముత్యాలనాయుడు తెలియజేశారు. సోమవారం, మంగళవారం గవర్నర్ తీర్మానంపైనే చర్చ జరగనుంది. అధికార పక్షానికి 5 గంటల 3 నిమిషాలు కేటాయించారు. ప్రతిపక్షానికి 54 నిమిషాలు, జనసేనకు 3 నిమిషాల సమయం కేటాయించారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏనాడు చంద్రబాబు రైతుల సంక్షేమం కోసం కృషిచేయలేదని ఆరోపించారు. ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించడంతో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నీరు, చెట్టులో రూ.18,000 కోట్లు దోచుకున్నారని, పోలవరం రూ.16,000 నుంచి రూ.54,000 కోట్లకు పెంచారని, ధర్మపోరాట దీక్షతో రూ.500 ఖర్చు చేశారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలతో సభలో కలకలం రేగింది. ప్రతిపక్షంలోకి వెళ్లినా అచ్చెన్నాయుడు బుద్ధి మారలేదని మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్పీకర్ వారిని వారించారు. గవర్నర్ ప్రసంగంలో సమగ్రాభివృద్ధిపై ప్రతిపాదనలు లేవని, ఐదేళ్లపాటు సమర్ధవంతమైన పాలన అందజేశామని గుర్తుచేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నామన్న భ్రమలో మాట్లాడుతున్నారని, గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ మాటలకు చేతలకు పొంతన లేదని, పోలవరం విషయంలో వైసీపీ కన్ఫ్యూజన్‌లో ఉందని ఆయన ఎద్దేవాచేశారు. పోలవరాన్ని కేంద్రానికి వదిలేశామని ఢిల్లీలో చెప్పిన సీఎం, విజయవాడ రాగానే మళ్లీ మాట మార్చారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో పోలవరం అంచనాలు భారీగా పెంచారని అంటున్నారని, అంచనాలు తగ్గించి పోలవరం పూర్తి చేస్తే సన్మానం చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు.
లోకేష్ పై సెటైర్లు
ఏపీ అసెంబ్లీ నాలుగో రోజు వాడీవేడిగా సాగుతోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం జరిగిన చర్చ.. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. పోలవరం ప్రాజెక్టుపై చర్చ సమయంలో ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడి మధ్య మాటల తూటాలు పేలాయి.అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమలో ఉన్నారని మంత్రి అనిల్ సెటైర్లు పేల్చారు. ప్రతిపక్షంలో కూర్చొన్నా అచ్చెన్నాయుడు తీరు మారలేదన్నారు. నీటి బొట్టులేకుండా నీడ నిచ్చే చెట్టు లేకుండా టీడీపీ నేతలు రూ. 80వేల కోట్లు దోచుకున్నారని..పోలవరాన్ని అంచనాలను టీడీపీ పెంచిదన్నారు. మంత్రి అనిల్ వ్యాఖ్యలకు అచ్చెన్న కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నామన్న భ్రమలో మాట్లాడుతున్నారని.. ఐదేళ్లపాటు సమర్ధమైన పాలన అందించామన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ కన్ఫ్యూజన్‌లో ఉందని.. ఆ ప్రాజెక్ట్‌ను కేంద్రానికి వదిలేశామని సీఎం ఢిల్లీలో చెప్పారన్నారు. విజయవాడ రాగానే పోలవరంపై సీఎం మళ్లీ మాట మార్చారని.. టీడీపీ హయాంలో పోలవరం అంచనాలు భారీగా పెంచారని అంటున్నారని.. అయితే అంచనాలు తగ్గించి పోలవరం పూర్తి చేస్తే సన్మానం చేస్తామన్నారు. ఏమీ తెలియని అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు మంత్రి కాగానే.. చంద్రబాబుకే ఇరిగేషన్ పాఠాలు నేర్పించడం చూస్తే బాధేస్తోందన్నారు. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అదే రేంజ్‌లో కౌంటరిచ్చారు. మంగళగిరి అని పలకలేని వాడిని కాదని సెటైర్లు పేల్చారు. తమకేం తెలియకున్నా నేర్చుకుంటామన్న మంత్రి.. కనీసం ఎన్నికల్లో గెలవలేని వ్యక్తిని మంత్రిగా చేసిన ఘనత టీడీపీదేనని అన్నారు. అనిల్ వ్యాఖ్యలతో వైసీపీ ఎమ్మెల్యేలు నవ్వుకున్నారు.
టీడీపీకి హక్కు లేదు
ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షనేత చంద్రబాబు పోరాడుతున్నారంటూ టీడీపీ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రులు అవంతి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం నీతి ఆయోగ్‌ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడినట్లు చంద్రబాబు నాయుడు ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.  హోదాపై టీడీపీ సభ్యులు అలా మాట్లాడినట్లు చూపిస్తే.. సభలో తలవంచుకుని నిలబడతానంటూ మంత్రి బొత్స  సత్యనారాయణ సవాల్‌ చేశారు.హోదా వద్దని ప్యాకేజీని ఎందుకు తీసుకువచ్చారని మంత్రి ఘాటుగా ప్రశ్నించారు. హోదా సంజీవని కాదంటూ చంద్రబాబు అవహేళన చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. హోదా గురించి మాట్లాడే హక్కు టీడీపీ సభ్యులకు లేదని తీవ్రంగా హెచ్చరించారు. కేంద్రంతో కొట్లాడైనా సరే ఏపీకి ప్రత్యేక హోదాను తెచ్చి తీరుతామని మంత్రి బొత్స మండలిలో స్పష్టం చేశారు.  

Related Posts