YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మన్మోహనం లేని పార్లమెంట్

మన్మోహనం లేని పార్లమెంట్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

భారత్ ను ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తన సరళీకృత ఆర్ధిక విధానాలు రూపొందించిన నేత ఆయన. ఎనిమిదిన్నర దశాబ్దాలు దాటిన వయస్సు వచ్చినా ఇప్పటికి ఆయన పనితీరు ఏమాత్రం తగ్గలేదు. పదేళ్ళు యుపిఏ సర్కార్ లో ప్రధానిగా అంతకుముందు మాజీ ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్దికమంత్రిగా సేవలందించిన మౌన ముని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసింది. అయితే ఆయనను తిరిగి పెద్దల సభకు పంపించేంత బలం కాంగ్రెస్ కి లేకపోవడంతో ఆర్ధిక నిపుణుడి సేవలను దేశ అత్యున్నత చట్ట సభ కోల్పోతుంది.1932 సెప్టెంబర్ 26 లో పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని గాహ్ లో జన్మించారు మన్మోహన్ సింగ్. దేశ విభజన తరువాత అక్కడి నుంచి వచ్చిన మన్మోహన్ ఇంగ్లాండ్ కేంబ్రిడ్జ్ నుంచి ఆర్ధిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. ఆ తరువాత దేశ విదేశాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు ఆయన. 1982 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా విశేష సేవలందించారు. ఆతరువాత 1991లో పివి నరసింహారావు ప్రధాని బాధ్యతలు చేపట్టిన నాటికి దేశం ఆర్ధిక సంక్లిష్టత లను ఎదుర్కొంటున్న సందర్భం అది. దేశాన్ని గాడిన పెట్టె ఆర్ధిక వేత్త కోసం పివి గాలించి శోధించారు. పివి సలహాదారు పిసి అలెంగ్జాన్డర్ ఇచ్చిన సలహా తో మన్మోహన్ సింగ్ ను రప్పించి ఆయనను రాజ్యసభకు పంపి ఆర్ధికమంత్రి ని చేశారు నరసింహారావు.ఆర్థికమంత్రికి ముందు యూనివర్సిటీ గ్రాంట్స్ ప్లానింగ్ కమిషన్ కి ఛైర్మెన్ గా సింగ్ పదవిలో కొనసాగుతున్నారు. ఆ తరువాత 2004 లో యుపిఎ ప్రధాని అభ్యర్థిగా సోనియా తప్పుకోవడంతో మన్మోహన్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యుడిగా ఉండటంతో ప్రధాని కీరిటం ఆయన్ను వరించింది. పివి హయం నుంచి సోనియా, రాహుల్ జమానా వరకు అస్సాం నుంచి రాజ్యసభకు ఎంపిక అవుతున్న మన్మోహన్ కు ఇప్పుడు ఛాన్స్ లేకుండా పోయింది. ఒడిస్సా ఇతర రాష్ట్రాలనుంచి ఆయన్ను రాజ్యసభకు వెంటనే పంపే అంత బలం కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో కోల్పోవడంతో అజాతశత్రువు విశ్రాంతి జీవితం గడపనున్నారు. వయోభారం రీత్యా ఆయన అవసరాలతో ప్రస్తుతం కాంగ్రెస్ కి పని లేనందున త్వరలో ఏర్పడే రాజ్యసభ స్థానాల ఖాళీలో ఇతర రాష్ట్రాల నుంచి పెద్దల సభకు ఆయన్ను పంపే అవకాశాలు ఇప్పుడు లేవంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి తన ఉద్యోగ జీవితంలో కానీ, రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తిగా దేశానికి సేవలందించిన మన్మోహన్ సింగ్ శేష జీవితం సాఫీగా సాగాలని ఆయన సలహాలు సూచనలు ఇస్తూనే వుండాలని అంతా కోరుకుంటున్నారు.

Related Posts