YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిరుద్యోగ యువతకు సెల్ఫ్ ఎంప్లాయి మెంట్ టైలరింగ్ క్రింద కుట్టు మిషన్ లు

  నిరుద్యోగ యువతకు సెల్ఫ్ ఎంప్లాయి మెంట్ టైలరింగ్ క్రింద  కుట్టు మిషన్ లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ గతంలో నిరుద్యోగ యువతకు సెల్ఫ్ ఎంప్లాయి మెంట్ టైలరింగ్ క్రింద నైపుణ్య శిక్షణ ప్రభుత్వం ద్వారా  జరిగింది. అందులో భాగంగా శిక్షణ పొందిన వారికి కుట్టు మిషన్ ఇవ్వటం కూడా జరిగింది. ప్రయోగాత్మకంగా ఇప్పుడు శిక్షణ- ఉత్పత్తి- ఉపాధి అనే కాన్సెప్టుతో ముందుగా IL &FS వారి సహకారంతో క్రింది ప్రదేశాలలో  శిక్షణ మరియు ఉత్పత్తి కేంద్రాలను మొదలు పెట్టడం జరుగుతుంది

1. విశాఖపట్నం లోని భీమిలీ మండలం చిప్పాడ గ్రామంలో
2. వడ్లపూడి అప్పారెల్ పార్కు లో
3. వివి మంగమ్మ కాలేజ్ ఒంగోలులో.
4. జె బి డిగ్రీ కాలేజ్ కావలి లో
5. శ్రీ సిటీ నెల్లూరు లో

ఐదు ప్రదేశాలలో ఉన్న ఈ  సెంటర్ల ను చుట్టుపక్కల ఉన్న టెక్స్టైల్ యూనిట్లతో అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ విద్యాసంస్థలతో అనుసంధానం చేయటం జరిగింది.
తద్వారా ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ లో నైపుణ్య శిక్షణ పొందిన యువత మరియు మహిళలు ఈ ట్రైనింగ్ సెంటర్లను ఉత్పత్తి సెంటర్లుగా అనేక రకాలైన డ్రెస్ మెటీరియల్ కుట్టటం ద్వారా ఉపాధి పొందగలుగుతారు. వీటిని దగ్గర్లో ఉన్న టెక్స్టైల్ యూనిట్లకు ఇవ్వటం ద్వారా వారి ప్రాంతంలోనే వారు నెలసరి ఆదాయం పొందగలుగుతారు.

ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం తగినంత రిజల్ట్ ఇచ్చినట్లయితే మిగిలిన ప్రాంతం లలో కూడా అనేక ఉపాధి కల్పన కేంద్రాలను విస్తరించడం జరుగుతుంది ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో మరియు ఎస్సీ కమ్యూనిటీ హాల్ ల లో....

Related Posts