YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ మాట తప్పరు.. అలా చేస్తే మేమూ మద్దతిస్తాం: జనసేన ఎమ్మెల్యే

 జగన్ మాట తప్పరు.. అలా చేస్తే మేమూ మద్దతిస్తాం: జనసేన ఎమ్మెల్యే

ఏపీ అసెంబ్లీలో జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మంగళవారం గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అధికార పక్షం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ మధ్యలో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సభలో నవ్వులు పూయించారు. గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన వరప్రసాద్ ప్రభుత్వ పథకాలపై ప్రశంసలు కురిపించారు. ప్రత్యేక హోదా అంశంపై కుడా అయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  జనసేన ఎమ్మెల్యే, వైసీపీ తమ మిత్రపక్షం బీజేపీని ఒప్పించి ప్రత్యేక హోదా సాధించాలని వ్యాఖ్యానించారు. వెంటనే స్పందించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి రాపాక వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. బీజేపీ తమకు మిత్రక్షం కాదు, పొత్తు పెట్టుకోలేదు.. తాము బీజేపీతో కలిసి పోటీ చేయాలేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎన్నికల్లో జనసేన టీడీపీతో అంతర్గత పొత్తు పెట్టుకుందని,  పైకి రెండు పార్టీలు విడి,విడిగా పోటీ చేసినా, బీఫామ్లు మాత్రం ఇష్టం వచ్చినట్లు పంచుకున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు శ్రీకాంత్ రెడ్డి. ఆయన ఢిల్లీ వెళ్లిన సమయంలో  ప్రధాని మోదీ తిరుమల వచ్చినప్పుడు ప్రత్యేక హోదా సాధనే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రాపాక వైసీపీ బీజేపీకి మిత్రపక్షమని వ్యాఖ్యానించడం తప్పేనని.. కేంద్రంతో సఖ్యతగా ఉండి హోదా సాధించాలని కోరుతున్నానని చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుందన్నది తన ఆశ అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కితాబిచ్చారు వరప్రసాద్. జగన్ పట్టుదల కలిగిన వ్యక్తి.. మాట తిప్పరు, మడం తిప్పరు అని నమ్మకం ఉంది.. మాట ఇస్తే వెనక్కు తీసుకోరు అని అభిప్రాయపడ్డారు. జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను సమర్థవంతంగా అమలు చేయాలని.. అమలు చేస్తే జనసేన కూడా మద్దతుగా ఉంటుందన్నారు.

Related Posts