యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టుపై ఇంగ్లాండ్ అతి భారీస్కోరు నమోదు చేసింది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. కళ్లు చెదిరే బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు బంతిని కసిదీరా బాదడమే పనిగా ఆడారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (71 బంతుల్లో 148) ఆఫ్ఘన్ బౌలర్లపై ఉగ్రరూపం ప్రదర్శించాడు. కనిపించిన ప్రతి బంతినీ స్టాండ్స్ లోకి పంపడమొక్కటే తన లక్ష్యం అన్నట్టుగా బ్యాట్ ఝుళిపించాడు. ఈ క్రమంలో అరుదైన సిక్సర్ల వరల్డ్ రికార్డు కూడా మోర్గాన్ కు దాసోహమైంది.