ఇటీవల కాలంలో అమెరికాకు అన్ని పక్కల నుంచి కస్టాలు వచ్చిపడ్డాయి. దేశ ఆర్ధిక విధాలు మొదలుకొని మంచు తుఫాను వరకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమెరికాను రైలీ మంచుతుపాను వణికిస్తోంది. తీవ్ర గాలులకు తోడు భారీ వర్షాలు, దట్టంగా మంచు కురుస్తుండటంతో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. దీని ప్రభావంతో తూర్పుతీరంలో ఉండే ప్రభుత్వ కార్యాలయాలు మూతపడగా.. న్యూజెర్సీ నుంచి మసాచుసెట్స్ వరకూ ఉండే నగరాలను వరద పోటెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దాదాపు 3,000 జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి...