YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాదు

ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాదు

గవర్నర్రి ప్రసంగంలో చివరిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం అంటూ ముగించారు.  బీజేపీ  గతంలో, ఇప్పుడు, రేపు చెప్పేది ఒక్కటే.... రాష్ట్ర ప్రభుత్వం కనుక ప్రత్యేక హోదా
ఇవ్వాలి అంటే బీజేపీ  కూడా స్వాగతిస్తుంది, వ్యతిరేకించడం లేదు. ఎందుకంటే 10 సం. ప్రత్యేక హోదా కావాలని అడిగింది బీజేపీ కాబట్టని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.  అసెంబ్లీ మీడియా పాయింట్ లో అయన మాట్లాడారు.  ప్రత్యేక హోదా అనేది ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. ఏ రాష్ట్రానికి అయినా ఇస్తే మాకు కూడా కావాలి అని మొట్టమొదట అడిగేది భారతీయ జనతా పార్టీ.  2017మార్చి తరువాత ఏ రాష్ట్రానికి  ఈ పేరు ఉండదు అని చెప్పారు. కానీ ఆ పని జనవరి 2018 తరువాత కూడా కొనసాగిస్తున్నారో అది ఈ  రాష్ట్రానికి కూడా కావాలి అని మేము తప్పనిసరిగా అడుగుతాం.  ప్రత్యేక  తరగతి హోదా అనే పేరు ఏ రాష్ట్రానికి ఇవ్వబడలేదు అనేది వాస్తవం. పేరు తప్ప పని చేస్తాం అని చెబుతున్నాం, చేసాం కూడా.  గత ప్రభుత్వ హయాంలోనే ఆ ప్రయోజనాలు ప్యాకేజీ రూపంలో ఇవ్వడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వం ప్యాకేజి కావాలో, వద్దో అని ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ  లేఖకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదని అన్నారు.  ఈశాన్య రాష్ట్రాలకు ఏ ప్రయోజనాలు ఇస్తున్నారో అదేవిధంగా మాకు కూడా ఇవ్వాలని మేము అడగాలని అనుకుంటున్నాం.  పారిశ్రామిక రాయితీల గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. కానీ ప్రత్యేక హోదా కు పారిశ్రామిక రాయితీలకు
సంబంధం లేదు.  పారిశ్రామిక రాయితీలు, ఆదాయపన్ను రాయితీలు అడగవద్దు అని మేము అనడం లేదు, కానీ రెండు కలిపి అడిగితే మొదట్లోనే మన ఆర్గుమెంట్ మిస్ అవుతాం.  ప్రత్యేక హోదా
కావాలి కావాలి అని అడిగితే లేని దానిని ఎక్కడి నుండి తేస్తారు. ఒకవేళ మరలా దేశంలో ప్రత్యేక హోదా అనేది ఇస్తే మన రాష్ట్రాన్ని కూడా అందులో చేర్చాలని కోరతామని అన్నారు.  విభజనహామీలతో, షెడ్యూల్ 9, 10 తప్ప  షెడ్యూల్ 13 లోని అన్ని హామీలు టచ్ చేసాం. దుగ్గరాజపట్నం, కడప స్టీల్ ప్లాంట్ తప్ప. వాటిని కూడా ఇవ్వము అని చెప్పలేదు.  వాటిని కూడా ఎలాతీసుకురావచ్చో ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తే, విభజన హామీలు 100 శాతం పూర్తి అవుతాయి.  కేసీఆర్ , జగన్ ఇద్దరూ కలిసి సహృదభావం తో నడుస్తున్న తీరు స్వాగతిస్తున్నాం.   కాళేశ్వరం ప్రాజెక్టు పై మాకు, రాష్ట్రానికి కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి.  నికర జలాల పంపకం పూర్తి కాకుండా అంత పెద్ద ప్రాజెక్టు కడితే క్రింద ఉన్న రాష్ట్రాలకు ఏవిధంగా నికర జలాలు వస్తాయి
అనే విషయం పై ముఖ్యమంత్రి   క్లారిటీ ఇచ్చి, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం కు వెళ్ళితే బాగుంటుంది.   ఎందుకంటే గతంలో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రిజల్యూషన్ కూడా పాస్చేయడం జరిగిందని అయన అన్నారు.

Related Posts