YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

రూ.10 నాణేలన్నీ చెల్లుతాయ్‌: ఆర్‌బిఐ

రూ.10 నాణేలన్నీ చెల్లుతాయ్‌: ఆర్‌బిఐ

మొత్తం 14 రకాల డిజైన్లతో కూడిన పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని, లావాదేవీల సందర్భంగా వీటిని అనుమతించవచ్చని భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) బుధవారంనాడు స్పష్టం చేసింది. కొంత మంది వ్యాపారులు పది రూపాయల నాణేలను అనుమతించడంలేదన్న వార్తల నేపథ్యంలో ఆర్‌బిఐ ఈ వివరణ ఇచ్చింది.

 పది రూపాయల నాణేలపై అనుమానంతో కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు, ప్రజలు వీటిని తీసుకోవడం లేదని తమ దృష్టికి వచ్చినట్టు ఆర్‌బిఐ పేర్కొంది. ఈ నాణేలపై అనుమానం అవసరంలేదని, విభిన్న రకాల డిజైన్లతో కూడిన నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఈ కాయిన్లు విలక్షమైన ఫీచర్లను కలిగి ఉన్నాయని, ఆర్థిక , సామాజిక, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే ఇతివృత్తాలతో ఈ నాణేలను ఎప్పటికప్పుడు చలామణిలోకి తెచ్చినట్టు తెలిపింది. 14 డిజైన్లతో కూడిన పది రూపాయల నాణేలను ప్రభుత్వ మిట్స్‌లోనే తయారు చేసినట్టు పేర్కొంది. లావాదేవీలు, ఎక్స్ఛేంజ్‌కు బ్యాంకులు ఈ నాణేలను అనుమతించాలని ఆర్‌బిఐ వెల్లడించింది.

Related Posts