యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశంలోనే కాదండోయ్.. మన రాష్ట్రంలో కూడా అభిమానులు ఉన్నారు. వీరిని అభిమానులు అనడం కంటే భక్తులని పిలవడమే బెటర్. ఎందుకంటే.. వారంతా ఏకంగా ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు.. పాలాభిషేకంతో ఆ విగ్రహానికి పూజలు కూడా నిర్వహించారు. ఆ భక్తులు ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే, చూడండి. తెలంగాణలోని జనగాం జిల్లాలోని బుస్సా కృష్ణకు ట్రంప్‌కు వీరాభిమాని. ట్రంప్‌ను దేవుడిగా కొలిచే కృష్ణ.. ఆయన ఫొటోను దేవుడి గదిలో పెట్టుకుని మరీ పూజలు నిర్వహించడం గమనార్హం. ఉదయాన్నే నిద్రలేవగానే అతడు ట్రంప్ ఫొటోకు పసుపు రాసి, బొట్టు, పూలు పెట్టి పూజలు చేస్తాడు. హారతి కూడా ఇస్తాడు. ఫిబ్రవరి 2017లో అమెరికాలోని కన్సాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ కుచిభట్ల హత్య అనంతరం కృష్ణ.. ట్రంప్‌ను ఆరాదించడం మొదలుపెట్టాడు. శ్రీనివాస హత్య నన్ను ఎంతో బాధించింది. భారతీయులు ప్రేమ, ఆప్యాయతల గురించి అమెరికా ప్రజలకు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తెలియజేయాలని నిర్ణయించుకున్నా. అందుకే, నేను ట్రంప్‌ను పూజిస్తున్నా. ఆయన నా ప్రార్థనలు చేరుతాయని భావిస్తున్నానని తెలిపాడు. తాను పబ్లిసిటీ కోసమే ఇదంతా చేయడం లేదని,
అమెరికా-ఇండియా ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొలిపేందుకే ఈ ప్రయత్నమని తెలిపాడు. తాను ఏర్పాటుచేసిన 6 అడుగుల ట్రంప్ విగ్రహానికి ఇకపై రోజూ పూజలు చేస్తానని కృష్ణ పేర్కొన్నారు.