YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ ద్వారా ఎంట్రీకి బీజేపీ ప్లాన్

జగన్ ద్వారా ఎంట్రీకి బీజేపీ ప్లాన్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కమలనాథుల ఆలోచనలు చాలా షార్ప్ గా ఉన్నాయి. దేశమంతా తమ గుప్పిట్లో ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో వెలుగు లేకుండా పోయిందే అన్న చింత మోడీ షా ద్వయంలో బాగా ఎక్కువగా ఉంది. అయితే రెండవమారు బంపర్ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి రావడం తెలుగు రాష్ట్రాలో ఎంట్రీకి తెలంగాణా ఓ ఓ గేట్ తెరచుకోవడంతో కాషాయదళం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజా లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీలు గెలుచుకున్న బీజేపీ మంచి యమ హుషార్ గా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ముందుకు సాగుతోంది. ఇందుకోసం కొత్త వ్యూహాలను కూడా రచిస్తోంది.ఏపీలో ల్యాండ్ స్లైడ్ విక్టరీతో దేశమంలోని అందరి ద్రుష్టిని ఆకట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇపుడు మోడీ, షాలకు హాట్ ఫావరేట్ అయిపోయాడని టాక్. ఏపీకి పూర్తి మద్దతుగా ఉంటామని, అవసరమైన సాయం చేస్తూనే ఉంటామని ఈ ఇద్దరూ జగన్ కి గట్టి భరోసావే ఇచ్చేశారు. జగన్ సైతం ఏపీని ముందుకు తీసుకునేందుకు మోడీ, షా తో కలసి ఉండాలని డిసైడ్ అయిపోయారు. ఇదిలా ఉండగా ఏపీలోనే కాదు, తెలంగాణాలో కూదా వైస్సార్, జగన్ చరిష్మా గట్టిగా ఉన్న సంగతి తెలిసిందీ. అక్కడ సామాజిక వర్గ సమీకరణలు చూసుకుంటే రెడ్లు రాజకీయంగా
బలంగా ఉంటారు. జగన్ ఇపుడు రెడ్లకు ఐకాన్ గా ఒక్కసారిగా మారిపోయారు. దానితో జగన్ని దువ్వడం ద్వారా తెలంగాణాలో పట్టు సంపాదించాలని, అక్కడ పాగా వేయాలని బీజేపీ వ్యూహాలు
రచిస్తోందని టాక్.ఇక తెలంగాణా సీఎం కేసీయార్ నిన్నటి వరకూ మోడీ, షా గుడ్ లుక్స్ లో ఉండేవారు. ఆయన ఫెడరల్ ఫ్రంట్ అంటూ నేషనల్ లెవెల్లో ఫిడేల్ వాయించాక ఆయనతో అవసరం లేదని తీర్మానించుకున్నారట. ఈ నేపధ్యంలో జగన్ని దువ్వడం ద్వారా తెలుగు రాష్ట్రాలో ఉనికిని చాటుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది. విభజన హమీల విషయలో ఎటూ ఏపీకి, తెలంగాణాకు పేచీ ఉంది. ఇది ముదిరి పాకాన పడితే జగన్ కేసీయార్ దోస్తీ కూడా డౌట్లో పడుతుంది. అపుడు రంగంలోకి బీజేపీ దిగి జగన్ వైపు ఉంటూ కేసీయర్ ని కట్టడి చేస్తుందని అంటున్నారు. అలా జగన్ని కేసీయార్ మీదకు ఉసిగొల్పడం ద్వారా వైసీపీని కూడా తెలంగాణాలో ఎంట్రీ ఇప్పించి రెడ్ల మద్దతు తెసుకోవాలని, వచ్చే ఎన్నికల్లో అక్కడ బీజేపీ, వైసీపీ పొత్తుల ద్వారా అధికారం సంపాదించాలన్నది కమలనాధుల మాస్టర్ ప్లాన్ ట. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి

Related Posts