Highlights
గవర్నర్ కు రాజీనామాను సమర్పించిన మాణిక్ సర్కార్
కొత్త ముఖ్యమంత్రి వచ్చే వరకూ ఆ పదవిలోనే
ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మాణిక్ సర్కార్
ఈశ్యాన్య రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో భాగంగా త్రిపుర పాలక పక్షం ఓటమి పాలుకావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఓటమికి నైతిక భార్యతవహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ తథాగత రాయ్ కి తన రాజీనామా లేఖను సమర్పించారు. సీపీఎం 16 సీట్లు గెలుచుకోగా, బీజేపీ-పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర కూటమి 43 సీట్లు సాధించడం విదితమే. ఈ నేపథ్యంలో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ తన పదవికి ఈరోజు రాజీనామా చేశారు.
కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఆ పదవిలో కొనసాగాలని మాణిక్ సర్కార్ కు గవర్నర్ సూచించారు. అనంతరం, మాణిక్ సర్కార్ మీడియాతో మాట్లాడుతూ, ఇన్నేళ్లు తమకు సహకరించిన ప్రజలు, అధికారులకు ధన్యవాదాలని, వారి సహకారం వల్లే ఇన్నేళ్ల పాటు తమ పాలన కొనసాగిందని అన్నారు.