యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడిపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. తాజాగా శివరామ్ నిర్వహిస్తున్న కే ఛానల్‌పై మరో ఫిర్యాదు పోలీసులకు అందింది. గౌతం కమ్యునికేషన్స్ పేరిటి నిర్వహిస్తున్న ఛానల్ అక్రమంగా స్టార్ టీవీ ప్రసారాలను పైరసీ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. స్టార్ టీవీ ప్రసారాలను డీటీహెచ్ ద్వారా చోరీ చేస్తున్నట్లు పోలీసులకు ఆ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఛానల్ ప్రసారాలను పైరసీ చేసి.. లక్షల రూపాయలు అక్రమార్జన చేశారని.. స్టార్ టీవీ ప్రతినిధులు గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఈ వ్యహారంపై కే ఛానల్ నుంచి స్పందన లేకపోవడంతో.. వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం అడ్వొకేట్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. గతేడాది కే ఛానల్ నిర్వహిస్తున్న కార్యాలయంలో సోదాలు చేశారు.. స్టార్ టీవీ ప్రసారాలను పైరసీ చేస్తున్నట్లు తేల్చారు. సాంకేతిక ద్వారా స్టార్ ప్రసారాలు చోరీ చేస్తున్నారని గుర్తించి.. డీకోడర్, ఎన్‌కోడర్‌లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆ నివేదికను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించారు. తర్వాత కోర్టు కోడెల శివరాంకు సమన్లు జారీ చేశారట.. అయినా స్పందన లేకపోవడంతో.. కమిషన్‌కు సంబంధించి లాయర్ కే ఛానల్ ఆఫీసుకు వెళ్లి సమన్లు తీసుకోవాలని సిబ్బందిని కోరారు.. వారు తీసుకోవడానికి నిరాకరించారు. సమన్లు తీసుకోవడానికి కే ఛానల్ సిబ్బంది నిరాకరించడంతో.. కమిషన్ లాయర్.. కోర్టు ధిక్కారణ కింద నివేదిక అందజేస్తామన్నారు. పనిలో పనిగా శివరామ్‌పై చర్యలు తీసుకోవాలని స్టార్ ప్రతినిధులు సీఐని కలిసి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కోడెల కుమారుడు, కుమార్తెపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందగా.. తాజాగా స్టార్ టీవీ వ్యవహారం బయటపడింది.టీడీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె పూనాటి విజయలక్ష్మిపై తాజాగా మరో కేసు నమోదు అయింది. ఆరోగ్య శ్రీ పర్మిషన్ పేరుతో విజయలక్ష్మి తనను మోసం చేశారని సత్తెనపల్లికి చెందిన డాక్టర్ చక్రవర్తి ఈరోజు పోలీసులను ఆశ్రయించారు. ఆరోగ్య శ్రీ పర్మిషన్ ఇప్పిస్తానంటూ విజయలక్ష్మి తన నుంచి రూ.4 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు.తన నగదును వెనక్కి ఇప్పించాలనీ, అలాగే తనను మోసం చేసిన విజయలక్ష్మిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ మేరకు డా.చక్రవర్తి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో విజయలక్ష్మితో పాటు బొమ్మిశెట్టి శ్రీను, పోట్ల ప్రసాదుపై ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పూనాటి విజయలక్ష్మిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో కె ట్యాక్స్ పేరుతో వసూళ్ల నేపథ్యంలో కోడెల కుమారుడు శివరామ్ పై ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి.