YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

జులై లో మునిసిపల్ ఎన్నికలు 15 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు

 జులై లో మునిసిపల్ ఎన్నికలు 15 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. జూలైలో మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో పాత మున్సిపాలిటీల పాలకమండళ్ల పదవీకాలం జూలై 2తో ముగుస్తోంది. పక్షం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి వర్గం సూచించింది. ఈ ప్రకారం జూలై 10వ తేదీ నాటికి రిజర్వేషన్లను పూర్తి చేసి ఆ వెంటనే ఎన్నికలకు వెళ్లనున్నారు. జూలై 2తో పాలకమండళ్ల గడువు ముగియనున్నందున ఎన్నికలు జరిగి కొత్త పాలకమండళ్లు ఎన్నుకునేంత వరకు ప్రత్యేకాధికారులను నియమించనున్నారు.
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్‌తో కలిసి 73 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు ఉన్నాయి. వీటిలో 69 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. 68 కొత్త మున్సిపాలిటీలు కూడా ఏర్పాటైనా ఇవి ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలనలోనే ఉన్నాయి. కాగా, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపేందుకు కనీసం 151 రోజుల గడువు అవసరమని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. జూలైలోనే ఎన్నికలు జరపాల్సి వస్తే రిజర్వేషన్ల పరిమితి, రెండు పర్యాయాలు రిజర్వేషన్లను కొనసాగించేలా ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం

Related Posts