YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇంద్రకీలాద్రిలో వరుణ యాగం

ఇంద్రకీలాద్రిలో వరుణ యాగం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కనకదుర్గమ్మ దేవస్థానం ఆద్వర్యంలో వరుణ యాగం ప్రారంభమయింది. రాష్ట్రంలో   ఎండ తీవ్రతతో ఉష్ణోగ్రత తీవ్రంగా వున్న కారణంగా,  ప్రజలు  ఇబ్బంది పడుతుండటంచేత సకాలంలో వర్షాలు లేక రైతులు,  వ్యవసాయానికి ఆటంకం కల్గడం తో రాష్ట్రం సస్యశ్యామలం ఉండడం కోసం లోక కల్యాణార్థమై వరుణ యాగం చేస్తున్నారని ఆర్చకులు అంటున్నారు.  ఈ సందర్బంగా  దేవస్థాన స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ ఆద్వర్యంలో వేద విద్యార్దులు, పండితులు దుర్గ ఘాట్ ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమం లో ఆలయ అధికారిణి కోటేశ్వరమ్మ  దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా వరుణ యాగం లో పాల్గొని పూజలు చేశారు. ఉదయం 06 గం.ల దేవస్థాన వేదం విద్యార్థులు,  అర్చక స్వాములు దుర్గాఘాట్ నందు వరుణ జపం, వారుణానుపాక పారాయణములు, శతానువాక పారాయణలు,  విరాట్ పర్వ పారాయణము జరిగింది. నదీ లో కూర్చుని వేద విద్యార్దులు, పండితులు వరుణ జపలు నిర్వహించారు.

Related Posts