యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
2019 వరల్డ్ కప్ లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. టిల్ ఫేవరెట్ ఆసీస్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి రెండోస్థానంలో ఉంది. భారత్ చేతిలో మాత్రమే కంగారూలు ఓడారు. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఫించ్ సేన తలపడనుంది. బంగ్లాపై గెలిచి అగ్రస్థానానికి ఎగబాకాలని ఆసీస్ ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆసీస్ సమతూకంగా ఉంది. టాపార్డర్‌లో డేవిడ్ వార్నర్, ఫించ్, స్మిత్ చెలరేగితే ఆసీస్ ఖాతాలో మరో గెలుపు ఖాయమే. ట్రెంట్‌బ్రిడ్జ్ వికెట్ పొడిగా ఉండడంతో స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో ఆసీస్ స్పెషలిస్ట్ స్పి న్నర్‌ను తీసుకోవచ్చు గత రెండు మ్యాచ్‌ల్లో మ్యాక్స్‌వెల్, ఫించ్ పార్ట్‌టైమ్ స్పిన్నర్లుగా సేవలందించారు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, రిచర్డ్‌సన్ తో కంగారూల పేస్ దళం కూడా చాలా బలంగా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ లు గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరోసారి కప్ సాధించడానికి ఆశ పడుతుంది. భారత్, ఇంగ్లాండ్, న్యూజీలాండ్ జట్లు చాలా బలంగా ఉన్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా భారత్ చేతిలో పరాజయం పాలైంది. మరి ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ జట్లను ఎలా ఎదుర్కుంటారో, అన్ని రంగాలలో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా జోరుకి ఏ జట్టు కళ్లెం వేస్తారో ఎదురు చూడాలి..