యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ నేతలు గురువరం రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వం వహించినట్లు సమాచారం. పలువురు టీడీపీ నేతలు భీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకొంది.
ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైంది. టీడీపీ 3 ఎంపీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. తాజాగా గురువారం జరిగిన సమావేశానికి వేదవ్యాస్, బొండా ఉమ, బడేటి బుజ్జి, కదిరి బాబురావు, చెంగల్రాయుడు, మాధవనాయుడు, జ్యోతుల నెహ్రు, ఈలినాని, మీసాల గీత, వరుపుల రాజా, కేఏనాయుడు, పంచకర్ల రమేష్ బాబు తదితరులు హాజరైనట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఉన్నారు ఈ నేతలు ఎందుకు సమావేశమయ్యారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ వైపు ఈ నేతలు చూస్తున్నారా... ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అని సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ నేతలు బీజేపీలో చేరుతారా... వైసీపీలో చేరుతారా అనే చర్చ సాగుతోంది. అయితే ఈ సమావేశం తర్వాత టీడీపీ నేతలు ఏం చెబుతారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.