YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్..

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్..

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్ లో పోలవరం చేరుకున్న సీఎం .. మూడు సార్లు విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణాలను పరిశీలించారు. హెలికాప్టర్ దిగిన తర్వాత జగన్ కు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వ్యూ పాయింట్ కు చేరుకుని ప్రాజెక్టును పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నదీగర్భంలో నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్ కు సంబంధించి ప్రధానంగా సీఎం ప్రశ్నలు లేవనెత్తారు. ఎగువ కాపర్ డ్యామ్ పనులు ఎంత వరకు పూర్తయ్యాయి?  భారీగా వరద వస్తే పరిస్థితి ఏంటి?  కాఫర్ డ్యామ్ కొట్టుకు పోకుండా తీసుకున్న రక్షణ చర్యలు ఏమిటి?   గోదావరిలో వరద వస్తుందని తెలిసీ సీజన్ ముగిశాక కాఫర్ డ్యామ్ ఎలా నిర్మాణం చేపట్టారని అధికారులను ప్రశ్నించారు. కాఫర్ డ్యామ్ కారణంగా నీరు స్పిల్ వేపైకి వచ్చి నిర్మాణాలకు ఆటంకం కలిగితే ఎలా అని సందేహం వ్యక్తం చేశారు. సీఎం అడిగిన ప్రశ్నలన్నింటికీ అధికారులు వివరణ ఇచ్చారు. సీఎంతో పాటు ఈఎన్ సీ వెంకటేశ్వరరావు, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ , రాష్ట్రమంత్రులు అనిల్ కుమార్ యాదవ్ , పిల్లి సుభాష్ చంద్రబోస్ . పి.విశ్వరూప్ , పలువురు ఎమ్మెల్యేలు పర్యటనలో పాల్గొన్నారు.

Related Posts