YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

'సబ్‌కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌’ ఇదే తమ ప్రభుత్వం విదానం..నినాదం

'సబ్‌కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌’      ఇదే తమ ప్రభుత్వం విదానం..నినాదం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

 ‘సబ్‌కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌’ అనేది తమ ప్రభుత్వం నినాదమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి ఆయన గురువారం ప్రసంగించారు. లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగాన్ని ప్రారంభించిన రాష్ట్రప్రతి.. స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓం బిర్లాను అభినందించారు. ప్రభుత్వం సుపరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా ఆయన ప్రసంగం కొనసాగింది.  సుస్థిరత, పారదర్శకత, అభివృద్ధిని కాంక్షిస్తూ దేశ ప్రజలు విజ్ఞతతో ఓటువేశారని రాష్ట్రపతి కితాబిచ్చారు. యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారని, ఈ సారి ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. 2014 నుంచి కొనసాగుతున్న ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇచ్చారని, మహిళా సభ్యుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. దాదాపు పురుషులతో సమానంగా మహిళా సభ్యులున్నారని చెప్పారు. లోక్‌సభలో సగం మంది తొలి సారిగా ఎన్నికైన వాళ్లే ఉన్నారని పేర్కొన్నారు. కిసాన్‌ సమ్మాన్‌ కింద రైతులకు సహాయం అందజేస్తున్నామని ఆయన చెప్పారు. ఆక్వా కల్చర్‌ ద్వారా అధిక ఆదాయం వస్తుందని, దీని కోసం బ్లూ రివల్యూషన్‌ తెస్తామని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల పక్కా ఇళ్లు నిర్మిస్తామని ఆయన అన్నారు. జన్‌ధన్‌ యోజన ద్వారా బ్యాంకింగ్‌ సేవలు ప్రతి ఇంటికి చేర్చామని ఆయన అన్నారు. అమర్‌ జవాన్ల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు రెట్టింపు చేశామన్నారు. వీర్‌ జవాన్‌ స్కాలర్‌షిప్‌లను రాష్ట్రాల పోలీసుల పిల్లలకూ వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. జిఎస్‌టితో పన్నుల వ్యవస్థ సులభతరమైందని, దీనిని మరింత సరళం చేస్తామని ఆయన అన్నారు. నల్ల ధనానికి వ్యతిరేకంగా ప్రారంభించిన కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తామని ఆయన చెప్పారు. ఖేలో ఇండియా ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తామని, క్రీడాకారులకు అత్యాధునిక సదుపాయాలు కలుగజేస్తామని ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని ఆయన చెప్పారు.

Related Posts