YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీని వీడడంలేదు

టీడీపీని వీడడంలేదు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తాము తెలుగుదేశం పార్టీని వీడుతున్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ పార్టీ నాయకుడు తోట త్రిమూర్తులు చెప్పారు. గురువారం నేడు కాకినాడలోని ఒక హొటల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు 20 మంది సమావేశమయ్యారు.  ఈ సమావేశంలో వారంతా టీడీపీని వీడడానికి నిర్ణయం తీసుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటన్నీంటిని త్రిమూర్తులు కొట్టివేసారు.. గత ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్షించడానికి సమావేశమయ్యామని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశంలో పంచకర్ల రమేశ్, బోండా, కదిరి బాబూరావు, మీసాల గీతా, మాధవ నాయుడు, జోతుల నెహ్రూ, బడేటి బుజ్జి, వరుపుల రాజా తదితరులు పాల్గొన్నారు.

Related Posts