YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

దాబాలో దర్జాగా వ్యభిచారం

Highlights

  • పెడదోవ పడుతున్న యువత
  • పోలీసుల అండ..
దాబాలో దర్జాగా వ్యభిచారం

పెడదోవపడుతున్న యువకులు, విద్యార్థులు వెసనాలకు అలవాటుపడి  వ్యభిచార కూపంలోకి కూరుకుపోతున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన అధికారులే అండదండలిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. ఇదే అదునుగా కొందరు స్వార్థపరులు యువతను పెడదోవపట్టిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు కొందరు సహకరిస్తుండటంతో నీతి, నిజాయతీతో పనిచేస్తున్న పోలీసులు గౌరవప్రదమైన తమ శాఖ పరువుపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 44వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఓ దాబాలో ఈ వ్యవహారం సాగుతోంది. అనంతపురం జిల్లా పామిడి పోలీసుల అండదండలతో సమీప దాబాలో వ్యభిచార కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గతంలో గుట్టుచప్పుడు కాకుండా అడపాదడపా సాగే ఈ వ్యవహారం ప్రస్తుతం బహిరంగ రహస్యంగా మారింది.ఈ వ్యవహారంలో కొందరు భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. కొందరి పోలీసుల ద్వారా తమకు ముందుస్తు సమాచారం అందుతోందని నిర్వాహకుడు బహిరంగంగా వెల్లడించడం గమనార్హం. సదరు దాబాలో కొంతమంది మహిళలు అందుబాటులో ఉండటం వల్ల రాత్రి, పగలు అన్న తేడా లేకుండా వ్యభిచారం యథేచ్ఛగా సాగుతోంది. కొందరు యువకులు వారి ఉజ్వల భవిష్యత్తును చేజేతులా బుగ్గిపాలు చేసుకుంటున్నారు. వాట్ ఏ షాప్
చూడటానికి అది రేకులషెడ్డులా కనిపిస్తుంది. కానీ, పేరుకే దాబా. అందులో ఏ రకమైన ఆహార పదార్థాలు లభించవు. అంతా వాట్సాప్ ద్వారానే వ్యాపారం నడుస్తోంది. ఎంత సొమ్ము చెల్లిస్తే అంత మంచి అమ్మాయిలను అందుబాటులోకి తెస్తామని నిర్వాహకుడు ఫొటోలు చూపించి విటులకు మత్తెక్కిస్తున్నాడు. రహస్యంగా ఫోన్ నెంబర్లు ఇప్పించుకొని వాట్సాప్ల ద్వారా అమ్మాయిల ఫొటోలను పంపుతూ కింద ధరను సైతం వెల్లడిస్తున్నాడు. ఇలా హైటెక్ తరహాలో కార్యకలాపాలకు తెరలేపాడు. పోలీసు ఉన్నతాధికారులు ఇలాంటి దాబాలపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకొని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశాం - నరేంద్రరెడ్డి, సీఐ, పామిడి సర్కిల్ పామిడి సర్కిల్ పరిధిలోని పామిడి, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక గస్తీ బృందాన్ని ఏర్పాటు చేశాం. అంతేకాకుండా మా సర్కిల్ పరిధిలోని ముఖ్యంగా  44వ జాతీయ రహదారిలో అసాంఘిక కార్యకలాపాలు సాగకుండా ప్రత్యేక బృందం నిత్యం విధుల్లో ఉంటుంది. ఎక్కడైనా వ్యభిచారం జరుగుతోందని మా దృష్టికి తెస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Related Posts