యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పెద్దలు, పిల్లలు రోజువారి జీవనశైలికి యోగా చాలా అవసరంగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సూచించారు. శుక్రవారం ఉదయం పోలిసు పేరెడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ యోగా దినం పురస్కరించుకొని జ్యోతి ప్రజ్వలన చేసారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో అతి పురాతనమైన సంప్రదాయాలలో యోగా కు ప్రముఖమైన గుర్తింపు ఉందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఐక్యరాజ్యసమితి యోగా వల్ల మానసిక లాభాలను గుర్తించిందన్నారు. భాతరదేశంలోనే యోగా అనేది పుర్వం నుంచి గుర్తించినందుకు చాలా గర్వపడుతున్నట్లు చెప్పారు. సిద్ధాంతాలు, పద్దతులు భారతదేశంలో వేల సంవత్సరాల పూర్వము ఆవిర్భవించాయని అప్పటి బూషులు, యోగులు చెప్పారన్నారు. ఈ యోగాను క్రమం తప్పకుండా పాటిస్తే మానసిక ఉల్లాసంతో పాటు అనేక రకాలైన రుగ్మతులకు దూరంగా ఉండటం జరుగుతుందన్నారు. యోగ శాస్తం దాని పరిజ్ఙానాలకు ఆధునిక, సామాజిక అవసరాలకు, జీవన శైలికి సరిపడే విధాంగా మేధావులు దానిపై రాయటం జరిగిందన్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఉత్సాహభరితంగా ఉండే అవకాశం ఉందన్నారు. యోగా మాస్టర్ సుబ్రమణ్యం సారధ్యంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, డాక్టర్ ఎం.సిరి యోగాసనాలు వేసారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ కె.శకుంతల, పి.ఓ.ఎస్.ఎ.వెంకటేశ్వర్లు, డిఆర్.డి.ఎ.పి.డి. నరసిహులు, డి.ఎన్.డి.ఓ మతిరాజ్ , జిల్లా విదయాశాఖాధికారి సుబ్బారావు, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.