యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రెండుదేశాల మధ్య శాంతి చర్చలు జరగాలని ఇటీవల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖకు మోదీ స్పందించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపితేనే.. చర్చలు సాధ్యం అవుతుందని మోదీ పాక్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. చర్చలు జరగాలంటే ఈ నిబంధన అవసరం అన్నారు. విశ్వసనీయమైన వాతావరణాన్ని కల్పించాలని, ఉగ్రవాదం ఉండకూడదని, హింస లేని పరిస్థితుల్లోనే చర్చలు సాధ్యం అవుతాయని మోదీ తన లేఖలో ఇమ్రాన్‌కు తెలిపారు. పాక్ నుంచి అందిన కంగ్రాట్స్ మెసేజ్‌కు ప్రతిగా.. భారత ప్రభుత్వం తన లేఖలో ఈ విషయాన్ని చెప్పినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.