యువ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
భారత క్రికెట్‌లో ఎంతోమంది బ్యాటు, బంతితో రాణించారు. అందులో ఎక్కువగా స్పిన్నర్ ఆల్‌రౌండర్లే ఉన్నారు. టీమిండియాకు తొలిసారి ప్రపంచకప్ అందించిన కపిల్‌దేవ్ తర్వాత ఆ స్థాయిలో ఫాస్ట్‌బౌలర్ ఆల్‌రౌండర్ కనిపించలేదు. ఇర్ఫాన్ పఠాన్‌లాంటి వాళ్లు వచ్చివెళ్లారు. వారిలో తీవ్రత తక్కువ. నిలకడ లేమి ఎక్కువ. అలా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జట్టుకు దొరికిన తురుపుముక్క హార్దిక్ పాండ్య. భీకర షాట్లతో విరుచుకుపడే అతడు భయపెట్టే బౌన్సర్లు వేయగలడు. ఈ ప్రపంచకప్‌లో 3 ఇన్నింగ్సుల్లో 89 పరుగులు చేశాడు. జట్టులో అత్యధిక స్ట్రైక్‌రేట్ 167 అతడిదే. బౌలింగ్‌లో అంత ఆకట్టుకోలేదు గానీ పాక్ మ్యాచ్‌లో కీలక సమయంలో 2 వికెట్లు తీశాడు. అత్యంత ఒత్తిడిలో హోరాహోరీగా సాగిన ఆసీస్ మ్యాచ్‌లో 27 బంతుల్లోనే 48 పరుగులు సాధించి స్కోరును 300 దాటించాడు. ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికాపై బౌలింగ్‌లో 0/31, బ్యాటింగ్‌లో 15*; ఆస్ట్రేలియాపై 48, 0/68; పాకిస్థాన్‌పై 26, 2/44 గణాంకాలు నమోదు చేశాడు... చూదాం మరి మిగిలిన టోర్నీ లో హార్దిక్ ఎంత వరకు రాణించి ఈ స్థానాన్ని ఎంత వరకు సుస్థిరపరుచుకుంటాడో