YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మచిలీపట్నం పోర్ట్ ఒక ఎండమావి?

Highlights

  • ఆర్ధికంగా మసక బారుతున్న మచిలీపట్నం
  • ప్రజా నేతలకు కావలసింది ఇదేనా?  ప్రజల ఆగ్రహం.
మచిలీపట్నం పోర్ట్ ఒక ఎండమావి?

ఓడరేవు మాట ఎలా వున్నా దాని పేరుతో మచిలీపట్నం దాని చుట్టుప్రక్కల పొలాలు,స్థలాల ధరలు విపరీతంగా పెరిగాయి.అలాగే ఇళ్ల అద్దెలు కూడా నింగిని తాకాయి.ఇక్కడ ఏదో ఊడి పడతుందని.కానీ త్వరలోనే ఎన్నికలు రానుండటం, రాజేవరో కింకరుడు ఎవరో తెలియని స్థితిలో ఇప్పటికే రెండుసార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసిన ఈ ఓడరేవు పనులు మొదలయ్యే అవకాశాలు మృగ్యంగా కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.ఇక మిగిలింది స్థలాలు,పొలాలరేట్లతో కొనేవారులేక అటు అమ్ముకోలేక ,ఇటు రేటు దిగి అమ్మలేక ఉభయ బ్రష్టుత్వంతో వున్నారు.
వేసవిలో ఎండ మావిలా మచిలీపట్నం ఓడరేవు నిర్మాణం తీరుతెన్నులు ఉన్నాయి.అసలు నిజంగా ప్రభుత్వానికి,ప్రజాప్రతినిధులకు స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడ కార్మికులకు పని దినాలు కల్పించాలంటే ఉన్న యాంకరింగ్  పోర్ట్ కి సంవత్స రానికి కనీసం 4,లేదా 5 నౌకలు రప్పించినా 5నుండి 6 నెలల వరకు వందలాది కార్మికులకు కనీసం పని దినాలు కల్పించగలిగే వారని పలువురు పేర్కొంటున్నారు.
ఓ సంఘటన 
  అన్ని కాలాలలో ఎగుమతులు, దిగుమతులకిఅనువైన ఓడరేవుగా సామర్ధ్యం ఉన్న ఈ ఓడరేవు కి 1987 జూన్ ప్రాంతంలో అమెరికా నుండి 30 వేల మెట్రిక్ టన్నుల బల్క్ యూరియా తో మచిలీపట్నం రేవుకి వచ్చిన ఎం.వి.దలాకి అనే ఓడే నేటివరకు అంటే 30 సంవత్సరాలలో ఈ రేవుకు వచ్చిన ఆఖరి నౌక.ఆ నౌక యూరియా దిగుమతిలో షిప్పింగ్ ఏజెంట్ కి కార్మికుల లో రేగిన వేతన విషయంపై వివాదం ముదిరి శాంతిభద్రత సమస్య ఏర్పడగా అప్పటి జిల్లా ఎస్పీ ఎం.భాస్కరయ్య ఓడ రేవు వద్ద ఒక పోలీస్   ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయటం జరిగింది.అయినా వివాదం సర్దుమణగలేదు. అప్పుడే  కార్గో బోట్ లు ఓడ నుండి యూరియా తెచ్చి జెట్టీల వద్ద దింపటం జరిగినది.అక్కడినుండి గోడౌన్ కి తరలించాల్సిన యూరియా ఏజెంట్, కార్మిక వివాదంలో వార్ఫ్ మీదే ఉండటంతో వర్షం కురిసి లక్షలాది రూపాయల విలువైన యూరియా నీరుగా మారి గంగపాలైంది. అది జరిగిన రాత్రే ఆ నౌకను కాకినాడకు మరలించి,మిగిలిన సరకు అక్కడే  దిగుమతి చేసిన ఆ ఓడ తిరిగి  వెళ్ళిపోయింది అని ఆనాడే రేవువర్గాలు తెలిపాయి.


నాటి నుండి మచిలీపట్నం రేవు పై జరిగిన ప్రచారము వలన ఈ రేవుకు అన్ని సిద్ధంగా ఉన్నప్పటికి  కార్మిక సమస్య పై వారు అన్ని రాష్ట్రాల్లోని ఏజెంట్లకు చెడ్డగా చెప్పటంతో ఈరేవుకు షిప్పింగ్ ఏజెంట్లు    ఎవరు నౌకను తీసుకు వచ్చెందుకు ముందుకు రాలేదని వారు పేర్కొంటున్నారు.పనిలో పనిగా అప్పటివరకు మచిలీపట్నం ఓడరేవు ప్రధాన కార్యాలయంగా నిజాంపట్నం,కృష్ణపట్నం ఓడరేవులు పని చేస్తుండే గొప్ప చరిత్ర ఉండేది మచిలీపట్నం ఓడరేవు కార్యాలయానికి .క్రమేణా తమ ప్రాంత అభివృద్ధికి విభేదాలు, పార్టీలు మరచి  ఒకే త్రాటిపై  నడిచే కాకినాడ ప్రాంత నాయకులు,కొందరు ఓడరేవు అధికారులు  కలిసి  ఈ రేవును నిర్వీర్యం చేసి,కాకినాడ రేవుకు మంచి రేవుగా తీర్చిదిద్దే భాగంగా,   ముందు ఇక్కడ ఉన్న 18 కార్గో బొట్లను కాకినాడకు తరలించేశారు.నిదానంగా మెరైన్ డివిజన్,వర్క్ షాప్,ఓడరేవు అధికారి కూడా అక్కడికే తరలించారు.ఇక్కడ అదేమని ఆడిగినవా రు లేకపోయారు ఆరోజుల్లో.
అయితే గత  నాలుగేళ్లకు  ముందు  ప్రముఖ షిప్పింగ్ ఏజెంట్ కంపెనీ  "ఎస్కే షిప్పింగ్ కంపెనీ" అధినేత కి.శే.డా.కె.ఎన్. రావు చొరవతీసుకుని   ఇప్పుడు ఉన్న యాంకరింగ్ రేవు లో తిరిగి   కార్యకలాపాలు నిర్వహించి అనువుగా ఉందని చెప్పేందుకు తొలుత  ఈరేవుద్వారా 40 మెట్రిక్ టన్నుల బరువైన 3 భేల్ తయారీ జనరేటర్లను పంపించి అల్ వెదర్ పోర్ట్ అని రుజువు చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన మరణంతో కార్య కలాపాలు నిలిచిపోయాయి. ఎవరైనా కల్పించుకుని ఇలాగే కనీసం యాంకరింగ్ పోర్ట్ గా దీన్ని పని చేయించినా కొంత బాగుండేది,స్థానిక ప్రజల్లో తమ భూములు ఇచ్చేందుకు నమ్మకం కలిగేది.
అలాంటిది ఒక్కసారిగా డీప్సీ పోర్ట్ పేరుతో వేలాది ఎకరాలు కావాలంటే నమ్మలేని స్థితి ని వారి వారి మనుగడ కోసం కొందరు   ప్రజా ప్రతినిధులే  కలిపించారు. ఒకరు అధికారంలో ఉంటే ప్రతి పక్షం ఇన్నీవేలు అవసరమేమిటని,సింగపూర్ లో కేవలం 1300 ,చైనాలో తక్కువ ఎకరాలు   కాగా ఇక్కడ ఎందుకు  ఇన్నివేల ఎకరాలు  అని ఆనాటి ప్రతిపక్షం లో ఉన్న టీడీపీ వారు అంటే, నేడు ప్రతి పక్షంలో ఉన్న ఆనాటి   అధికార పార్టీ  నాయకులు ఎలా తీసుకుంటారని నేడు అడ్డుకుంటున్నారు.
  ఓడరేవు మాట ఎలా వున్నా దానిపెరుతో మచిలీపట్నం దాని చుట్టుప్రక్కల పొలాలు,స్థలాల ధరలు విపరీతంగాపెరిగాయి.అలాగే ఇళ్ల అద్దెలు కూడా నింగిని తాకాయి.ఇక్కడ ఏదో ఊడి పడతుందని.కానీ త్వరలోనే ఎన్నికలు రానుండటం, రాజేవరో కింకరుడు ఎవరో తెలియని స్థితిలో ఇప్పటికే రెండుసార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసిన ఈ ఓడరేవు పనులు మొదలయ్యే అవకాశాలు మృగ్యంగా కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.ఇక మిగిలింది స్థలాలు,పొలాలరేట్లతో కొనేవారులేక అటు అమ్ముకోలేక ,ఇటు రేటు దిగి అమ్మలేక ఉభయ బ్రష్టుత్వంతో వున్నారు.
 దేశంలో ఎక్కడా లేని రీతిలో ఈ పట్టణ జనాభా 25 వేలు తగ్గింది . కారణం ఇక్కడ  పరిశ్రమలు,వ్యాపారాలు లేక పోవడంతో వలసలు వెళ్లారు.పైగా జిల్లాకేంద్రంలో వుండవలసిన సుమారు 30 కార్యాలయలు విజయవాడ తరలించినా అడ్డుకున్నవారులేరు.వుండవల సిన అధికారులు,ఉద్యోగులు విజయవాడ వదిలి రాకపోవటం తో  జనాభా తగ్గుదలకి   ఒక ముఖ్య కారణము.ఫలితంగా ఈ పట్నానికి పల్లెవాతావరణం చోటుచేసుకుంటున్నదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.


 ఇలాంటి పరిస్తితిలే పెరిగిన ఇంటి అద్దెలు  దిగిరాక,దిగేవారు లేక పోయినప్పటికి   తక్కువకు ఇవ్వలేక  ఖాళీగా అలాగే ఉంచుకుంటున్నారు.దీనికి తోడు పులిమీద పుట్రలా ప్రభుత్వం జి+3గృహాలను ఒకేసారి 6,400 నిర్మాణానికి ఈనెల మొదటి తేదీన అంకురార్పణ చేసింది.ఇవి పూర్తయితే పట్ణణంలో గృహం లేని చిన్న, మధ్యతరగతి ప్రైవేట్ ఉద్యోగులకు ఇళ్ల వసతి ఇంచుమించు   ఎనబయ్ శాతం తీరిపోయి,ఖాళీగా ఉన్న మిగిలిన ఇళ్లల్లో అద్దెకు దిగేవారు కూడా ఉండక పోవచ్చు.కారణం బయటివారు రారు,వుండలిసిన వారు ఉండరు పైగా అనేక కార్యాలయాలు తరలి వెళ్లాయి. ఏతా వాత పరిశీలిస్తే పోర్ట్ పుణ్యమా అని భూములు అమ్ముకునే అవకాశం లేని రైతులు,భవిష్యత్ లో అద్దెలు రాక వస్తాయని భారీ లోన్లు తెచ్చి నిర్మించిన గృహ యజమానులు ఆర్థిసంక్షోభంలోనికి నెట్టి వెయ్యబడి మచిలీపట్నం ఆర్థిక స్థితి  పూర్తీగా  మసకబారి ప్రజల జీవన స్థితి గతి తప్పనుందని ఆర్ధిక నిపుణులు ఆందోళన చెందుతుండగా,ఈ స్థితికి కారకులైన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రానున్న ఎన్నికల్లో సమాధానం చెప్పేందుకు సన్నద్ధులవుతున్నారు.

                                                                       రచన..చలాది.పూర్ణచంద్ర రావు,సీనియర్ పాత్రికేయులు.


 

Related Posts