YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు : దేవగౌడ

కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు : దేవగౌడ

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ర్ణాటకలోని కాంగ్రెస్- జేడీ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం మనుగడ ఎంతకాలం ఉంటుందో చెప్పలేమని, రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మనుగడ కాంగ్రెస్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని మీడియాతో పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వం సాఫీగా సాగడానికి ముఖ్యమంత్రి కుమారస్వామి అన్ని విధలా ప్రయత్నిస్తున్నారని, అంతేకాదు ఓ క్యాబినెట్ పదవిని కూడా కాంగ్రెస్‌కు వదలుకున్నామని దేవెగౌడ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌‌పై దేవెగౌడ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల పాటు ప్రభుత్వానికి మద్దతు ఇస్తామన్న కాంగ్రెస్ వ్యవహారశైలిలో ఇప్పుడు మార్పులు చూస్తే మధ్యంతరం తప్పేలా లేదని అన్నారు. మాజీ ప్రధాని వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. తన తండ్రి వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్ధం చేసుకుందని, తమ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తిచేసుకుంటుందని అన్నారు. దేవెగౌడ వ్యాఖ్యలపై మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్ధరామయ్య మండిపడ్డారు. జేడీ (ఎస్)‌తో తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బలమైన సంబంధాలు కోరుకుంటున్నారని, అలాంటప్పుడు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఉపసంహరించుకుంటుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి కారణాలను తమపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో జేడీఎస్- కాంగ్రెస్ కలిసి పోటీచేసినా రెండు లోక్‌సభ స్థానాల్లో మాత్రమే విజయం సాధించాయి. బీజేపీ 25 సీట్లను సొంతం చేసుకుంది. జేడీఎస్‌తో చెలిమిని వదిలేయాని కాంగ్రెస్ అధిష్ఠానానికి సిద్ధరామయ్య, సీనియర్ ఎమ్మెల్యే హెచ్‌కే పాటిల్‌లు పలుసార్లు ఒప్పించే ప్రయత్నం చేశారు. దీని వల్ల కాంగ్రెస్‌కు మేలు జరుగుతుందని వాదించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏఐసీపీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని కార్యదర్శి, కర్ణాటక ఇంఛార్జ్ కేసీ వేణుగోపాల్, ఏకే అంటోనీలను సిద్ధూ కలవగా, పాటిల్ కూడా ప్రత్యేకంగా వేణుగోపాల్‌ను కలిశారు. ఈ సందర్భంగా జేడీఎస్‌తో పొత్తు వద్దని రాహుల్‌తో సిద్ధూ చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒంటరిగా పోటీచేస్తే అధిక సీట్లను గెలుచుకోవచ్చని సూచించారు. కానీ అధిష్ఠానం మాత్రం పొత్తు కొనసాగించాలని నిర్ణయించుకుంది. దీంతో ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

Related Posts