పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వే షన్ కల్పించాలని ఇవాళ వైఎస్ఆర్‌సీపి డిమాండ్ చేసింది. రాజ్యసభలో ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి మాట్లాడారు. రాజ్యాంగ సవరణ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. ఆర్టికిల్ 330ఏ, 332ఏ సవరణ కోరుతూ బిల్లును పెట్టారు. జనాభాకు తగ్గట్టుగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలను 50 శాతం ఓబీసీలకు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉన్న విధంగానే ఓబీసీలకు కూడా ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ తరహాలో ఓబీసీలకు ఓ చట్టాన్ని తయారు చేయాలన్నారు. రిజర్వేషన్ల అంశంలో తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు అన్నారు. తమిళనాడు ఓ రాష్ట్రం కాదు, అది ఓ ఉద్యమం అని ఆయన అన్నారు.