యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. ఈ భేటీలో మంత్రులు కొడాలి నాని, కన్నబాబు,శ్రీరంగనాథ రాజు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం,పౌర సరఫరాలు, సీఎంవో అధికారులు పాల్గోన్నారు. తరువత పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడారు. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా ఇస్తోన్న బియ్యం పక్కదారి పడుతోంది. తినడానికి పనికిరాకపోవడంతో రీసైక్లింగ్ కు పంపుతున్నారు. కేంద్రం నుంచి వస్తోన్న బియ్యం లో 25 శాతం నూక వస్తోంది. నాణ్యత లేని బియ్యం సరఫరా వల్ల అన్నం ముద్దగా మారుతోందని అన్నారు. రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీలో వినూత్న మార్పులు తీసుకువస్తున్నాం. కల్తీ లేని, తినేందుకు అనువైన సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీచేస్తాం. 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయని నిర్ణయించాం. బియ్యం సేకరణకు అవలంభించాల్సిన విధానాలపై చర్చించాం. సన్న బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వంపై వెయ్యి కోట్లు భారం పడుతుందని అంచనా వేసామని అన్నారు.