YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలో పదవుల జాతర

వైసీపీలో పదవుల జాతర

తెలుగుదేశం పార్టీ మాజీ సీనియర్‌ నాయకులు, ఇటీవల పార్టీమారిన నేతలకు వైసిపిలో పదవులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా టిడిపిలో పనిచేసినా దక్కని గౌరవం, నేడో, రేపో వైసిపిలో దక్కుతుం దని అభిమానులు, నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌, శాసన సభ్యుల గెలుపునకు ఎంతగానో కృషి చేసిన ముగ్గురు నేతలకు తొలి విడతలో పదవులు కట్టబెట్టడానికి వైసిపి నేతలు కసరత్తులు చేస్తున్నారు. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 'నుడా' చైర్మన్‌గా వైవి రామిరెడ్డి, ఆర్‌టిసి రీజినల్‌ చైర్మన్‌, లేదా స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కార్పొరేటర్‌ నూనె మల్లికార్జున యాదవ్‌, గ్రంథాలయ ఛైర్మన్‌గా కోటేశ్వ రరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపి స్తున్నాయి. పదేళ్లుగా వైసిపిని అంటి పట్టుకున్న నేతలు తమకు ఏదొక పదవి ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. టిడిపి కోసం పనిచేసి, పదవులు దక్కక చివరి క్షణంలో వైసిపి తీర్థం పుచ్చుకున్న పలువురు నేతలకు అధికారిక పదవులు ఇవ్వడానికి నేతలు కసరత్తులు చేస్తున్నారు. సీనియర్‌ రాజకీయ నాయకులుగా ఉన్నా సరైన గుర్తింపు, గౌరవం రాలేదని ప్రస్తుత ఎన్నికల సమయంలో పార్టీమారారు. 1983 నుండి రాజకీయాల్లో ఉంటూ తెలుగుయువత జిల్లా అధ్యక్షులు పనిచేసి, అటు తరువాత కాంగ్రెస్‌, మళ్లీ టిడిపి, ఇప్పుడు వైసిపి ఇలా ఏ పార్టీలో ఉన్నా తెరవెనుక రాజకీయాలు నడపడంతో ఆయన దిట్ట. ఆదాల ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేరున్నా ఇటీవల ఎన్నికల సమయంలో ఆయనను వదిలి ముందుగా వైసిపి తీర్దంపుచ్చుకున్నారు. అదే సమయ ంలో నెల్లూరు, నెల్లూరు రూరల్‌ఎంఎల్‌ఎలు పి. అనిల్‌కుమార్‌యాదవ్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆయన పదవికోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే నుడా ఛైర్మన్‌గా అవకాశం ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చినట్లు సమాచారం. అందులో భాగంగానే ఆయనకు వీరిద్దరి కోటాలో నుడా రామిరెడ్డికి దక్కేఅవకాశాలు కనిపిస్తున్నాయి. 30 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నా సరైనా గుర్తింపు రాలేదని, ఇవ్వలేదని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కల్పించని వైసిపిలోనైనా తమ నాయకునికి న్యాయం జరుగుతుందని ఆశపడుతున్నారు. మాజీ టిడిపి అధికారప్రతినిధి, కార్పోరేటర్‌ నూనె మల్లికార్జునయాదవ్‌ ఇటీవల టిడిపి నుండి వైసిపిలో చేరారు. 2014 ఎన్నికల సమయంలో బిసి కోటా కింద మేయర్‌గా అవకాశం కల్పించాలని నేతలను కోరారు. ఏన్నో యేళ్ల పార్టీలోఉన్నప్పటికి ఆయనకు సరైన గుర్తింపు లభించలేదు. ఇటీవల ఎన్నికలకు ముందు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌లు ఆయనను పార్టీలోకి ఆహ్వనించారు. అదే సమయంలో పార్టీ అధికారంలోకి వస్తే ప్రాధాన్యత కలిగిన స్దానంలో కూర్చోబెడుతామని ఇద్దరునేతలు హామీ ఇచ్చినట్లు సమాచారం. పదవులు కోసం కాదని, టిడిపిలో సరైన గుర్తింపు , గౌరవం లేదని అందుకే మీ వెంట వస్తానని చెప్పినట్లు తెలిసింది. అ నేపధ్యంలో స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌, లేదా రీజయన్‌ ఆర్‌టిసి ఛైర్మన్‌ వదవుల్లో ఏదోఒకటి అప్పగించేవిధంగా పావులుకదుపుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రితో మాట్లాడి నాయకులకు సరైన పదవులు కట్టబెట్టే విధంగా నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే విద్యార్ది, యువజన నాయకులుగా ఉండి, ప్రస్తుతం ఆదాల ప్రభాకర్‌రెడ్డి అనుచరులుగా ఉన్న కోటేశ్వరరెడ్డికి జిల్లా గ్రంధాలయ సంస్ద ఛైర్మన్‌ అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. ఆదాల కోటాలో ఆయనకు ఈ పదవి రానున్నట్లు సమాచారం. 25 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నా కాంగ్రెస్‌, టిడిపి పార్టీలో సరైనా గుర్తింపు రాలేదనే అసంతృప్తి ఉంది. ఈ నేపధ్యంలో ఇతర పార్టీలో నుండి వచ్చిన ముగ్గురు నేతలకు వైసిపి ప్రభుత్వంలో కీలక అదికారిక పదవులు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీ కోసం పదేళ్ల నుండి పనిచేస్తున్న తమను నేతలు గుర్తుపెట్టుకోవాలని కొందరు నేతలు కోరుతున్నారు. ముఖ్యమంత్రి వద్ద పంచాయితీ పెట్టి జిల్లాలోని అన్ని పదవులను నియోజకవర్గాల వారిగా ముఖ్యనేతలకు పంచిపెట్టేపనిలో ఉన్నట్లు సమాచారం. ఏం జరుగుతుంది. ఎవరి ఏ పదవి దక్కుతుందో చూడాలి.

Related Posts