YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రి

రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రి

అనంతపురం : రోగులతో ఆసుపత్రి కిటకిటలా డుతుంది. ఒపి వరుసలో నిలబడడానికి కూడా సందులేదు. ఇసుకేస్తే నేలరాలని చందంగా ఒపి విభాగాల్లో జనాలున్నారు. గర్భిణుల ఓపిలో కూర్చోవడానికి కూడా కాస్తజాగాలేదు. వార్డుల్లోని రోగులకు వైద్యులు సేవలు అందిస్తున్నారు. శస్త్రచికిత్సల చేయడానికి ఆపరేషన్‌ థియేటర్లలో వైద్యులు సిద్దమయ్యారు.. .. అంతలోనే కరెంట్‌కట్‌. దీంతో సేవలు మొత్తం స్తంభించి, చిన్న పిల్లలు మొదలు వృద్దల వరకు విలవిల్లాడారు. ఈ ఘటన గురువారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చోటుచేసుకుంది. పెద్దాసుపత్రిలో 23 విభాగాల్లో నిత్యం రెండు నుంచి మూడు వేలమందికి వైద్యసేవలు అందుతున్నాయి. ప్రధానంగా రెండు వేలమంది ఒపి సేవలను వినియోగించు కుంటున్నారు. మిగిలిన వారు వార్డుల్లో వైద్యసేవలు పొందుతున్నారు. అందులో 50 నుంచి వంద మందికి ఆపరేన్లు జరుగు తున్నాయి. ఈ సేవలన్నిటికి విద్యుత్‌ సహాయంతో అందు తున్నవే.ఏదైనా జబ్బు చేస్తే ముందుగా కంప్యూ టర్‌ లో రోగి పేరు, సంబంధిత ఒపి విభాగం పేరు నమోదుచేసి, క్రమ సంఖ్యతో కూడిన కంప్యూటరైజ్డ్‌ ఒపి చీటీని పొందాలి. అనంతరం ఒపిలో వైద్యులను సంప్రదించి వైద్య సేవలు పొందాలి. వైద్య నిర్ధాణ పరీక్షలు, ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌, సిటి స్కానింగ్‌ వంటి సేవలు పొందాలంటే విద్యుత్‌ తప్పనిసరిగా ఉండాలి. వార్డుల్లో వైద్యసేవలు పొందుతూ ఆపరేషన్‌ చేయించుకోవాలన్నా.. అత్యవసర విభాగంలో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సేవలు.. ఎస్‌ఎన్‌సియులో చిన్నపిల్లలకు వెంటిలేటర్‌.. ఇలా పలురకాల సేవలు విద్యుత్‌తో కూడుకున్నవే. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న విద్యుత్‌ సరఫరాపై అధికారుల పర్యవేక్షణ లోపించింది. వెరసి రోగుల ప్రాణాలు నిలుపుకునేందుకు ఆసుపత్రికి వస్తే.. ఉన్నప్రాణాలను గాలిలో కలుపుకోవాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు. 125 కెవి జనరేటర్‌ ద్వారా ప్రధాన ఆపరేషన్‌ థియేటర్‌, ఆసుపత్రి అన్ని విభాగాలకు ఫ్యాన్లు, లైట్లకు. మూడు 63 కెవి జనరేటర్లు ద్వారా బ్లడ్‌ బ్యాంక్‌, సిఒటి, అత్యసర విభాగం, నవజాత శిశు సంరక్షణ (ఎస్‌ఎన్‌సియు) విభాగాలకు విద్యుత్‌ సరఫరా అవుతుంది. మొత్తం 314 కిలో వాట్స్‌ సామర్థ్యం గల నాలుగు జనరేటర్లు ఉన్నాయి. అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా రమారమి అర్థగంట పాటు కూడా సరిగా పనిచేయలేకుపోతున్నాయి. వీటి మరమ్మతు పేరుతో నెలవారిగా వేలకు వేలు 'లెక్కలు' రాస్తున్నా వాటి పనితీరుమాత్రం మెరుగు పడడంలేదు. . కరెంట్‌ సరఫరా ఆగిపోతే కనీసం ఆరు గంటల పాటు అయినా ఆసుపత్రిలోని సేవలకు అవసరమైన సామర్థ్యం గల జనరేటర్లు అందుబాటులో ఉండాలి. వైద్యసేవలకు రూ.కోట్లు వెచ్చిస్తున్నా.. జనరేటర్ల విషయంలో అధికారులు చొరవ చూపకపోవడం బాధాకరం. ప్రస్తుతమున్న వాటిని తొలగించి నూతనంగా ఏర్పాటు చేసుకుని, నిరంతరం నిర్వహణ చేపడితేనే రోగులకు 'కరెంటు' కష్టాలు తప్పుతాయి.కుటుంబాన్ని పోషించేందుకు బెంగుళూరులో పనిచేస్తున్నాను. ప్రమాదవశాత్తు చేయివిరిగింది. అక్కడే వైద్యులు ఆపరేషన్‌ చేశారు. శస్త్రచికిత్స సరిగా చేయకపోవడంతో ఎముక కట్టుకోలేదు. దీంతో భరించలేని నొప్పికలుగుతుంది. పుట్టపర్తి ఆసుపత్రిలో ఎముకల డాక్టర్లు ఉచిత క్యాంపు నిర్వహించారు. వారిని సంప్రదించడంతో పెద్దాసుపత్రికి వెళ్లాలని సూచించారు. వారం నుంచి వార్డులోవున్నాను. ఆపరేషన్‌ చేస్తామని డాక్టర్లు చెప్పారు. కరెంటు పోవడంతో ఆపరేషన్‌ ఆగిపోయింది

Related Posts