యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగుదేశం పార్టీలో కాపు నేతలందరూ కాకినాడలో రహస్యంగా సమావేశం కావడం కలకలం రేపుతోంది. సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి పరాజయం పాలైన రాష్ట్రంలోని కాపు అభ్యర్దులు, మాజీ ఎమ్మెల్యేలంతా గురువారం కాకినాడలో సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు ముందే ఆయన పార్టీని వీడతారని ప్రచారం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు నేతలంతా కాకినాడ వచ్చారు. వీరంతా ఓటమిపై విశ్లేషణ చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశంపై కూడా వీరు చర్చించుకున్నారు. బీజేపీలో చేరడం వల్ల రాష్ట్రంలో వైసీపీ నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకోవడంతో పాటు కార్యకర్తలను కూడా రక్షించుకోవచ్చని ఒకరిద్దరు నేతలు సమావేశంలో సలహా ఇచ్చినట్లు తెలు్సోతంది. అయితే బీజేపీలోకి వెళితే కార్యకర్తలు రారనే అభిప్రాయానికి వచ్చారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన కొంతమంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీలోకి వెళ్లే అంశంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశంలో పాల్గొన్న కొంతమంది నేతలు మాత్రం వైసీపీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపారు. కొంత మంది వ్యతిరేకించారు. చంద్రబాబు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆయనతో ఒకసారి భేటీ అవుదామని అంతిమంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్ోతంది. పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు మారడం మంచిది కాదని కూడా మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది బీజేపీలోకి వెల్లేందుక ఇష్టపడకపోయినప్పటికీ, ఇప్పుటికిప్పుడే ఎవరూ బయటపడవద్దని, అన్ని విషయాలను మదింపు చేసుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తానికి కాపు సామాజికవర్గ నేతలు.. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారన్న విషయం మాత్రం స్పష్టం అయింది. ఆ మంచి అవకాశం ఎక్కడి నుంచి వస్తుందన్నదానిపైనే.. వారి రాజకీయ పయనం ఉంటుందని చెబుతున్నారు. అది టీడీపీ నుంచా.. లేక వైసీపీ నుంచా.. అన్నదానిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ లేదు. త్వరలోనే… మరిన్ని సంచలనాలు ఉంటాయన్న నేపధ్యంలో.. ఆ సంచనాల్లో వీరు కూడా చేరే అవకాశం ఉంది