YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎంపీలతో వైసీపీ ప్రెషర్ గ్రూప్ ...

ఎంపీలతో వైసీపీ ప్రెషర్ గ్రూప్ ...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:  

దేశాన్ని పాలించేది ఢిల్లీ. మొత్తం 29 రాష్ట్రాలకు అక్కడ హెడ్ ఉంటారు. కేంద్రం నుంచి రావాల్సినవి, తెచ్చుకోవాల్సినవి కూడా ఎన్నో ఉంటాయి. అయితే హస్తిన విషయంలో ప్రతీ రాష్ట్ర ముఖ్యమంత్రిది ఒక్కో స్టైల్. కొందరు తెలీకుండా లాబీయింగ్ చేసుకుంటారు. మరి కొందరు అందరికీ తెలిసేలా పదే పదే ఢిల్లీ వెళ్తూంటారు. మరి కొందరు తాము ఉన్న చోట నుంచి కదలకుండా ఢిల్లీలో చక్రం తిపేస్తూంటారు. దశాబ్దాల పాటు ముఖ్యమంత్రులుగా ఉన్నా కూడా కొందమంది ఢిల్లీ ముఖం చూడలేదంటే ఆశ్చర్యం. పశ్చిమ బెంగాల్ ని సుదీర్గ కాలం పాటు ఏలిన జ్యోతీబాసు ఢిల్లీకి పెద్దగా వచ్చేవారే కాదు. ఇపుడు చూస్తే పొరుగున ఉన్న ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఢిల్లీకి వచ్చేది తక్కువే. ఈ విషయంలో నిన్నటి వరకూ ఏపీకి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు రూటే సెపరేట్. ఆయన తన పదవీ కాలంలో లెక్కలేనన్ని సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారు.ఇక ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ది చంద్రబాబుకు పూర్తి భిన్నమైన వైఖరి.నేను 29 సార్లు ఢిల్లీ వెళ్ళాను, ప్రధానిని కలిశాను అని బాబు అంటే దాని వల్ల ప్రయోజనం ఏంటి అని జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ వెళ్ళాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలన్నది జగన్ ఆలొచనగా ఉంది. ఇక జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సంబంధించిన అంశాలు, విభజన హామీలు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని డిమాండ్ చేయడం వంటి అంశాలన్నీ పూర్తిగా తన ఎంపీల మీదనే విడిచిపెట్టేశారు. ఏపీ నుంచి వైసీపీ తరఫున గెలిచిన 22 మంది ఎంపీలే రాష్ట్రానికి న్యాయం చేసేలా కేంద్రాన్ని వత్తిడి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు.జగన్ మోహన్ రెడ్డి తాను తరచూ డిల్లీ వెళ్ళి చంద్రబాబు మాదిరిగా పంచాయతీలు పెట్టడానికి ఇష్టపడడం లేదు. అలాగని సమస్యలను వదిలేయడం లేదు. నిరంతరం కేంద్రం చెవిలో జోరీగలా సమస్యలు చెప్పేందుకు వైసీపీ ఎంపీలను ఆయన వాడుకుంటున్నారు. వారిని కొన్ని బ్రుందాలుగా విడదీసి కేంద్ర మంత్రిత్వ శాఖల వద్దకు పంపుతున్నారు. అలాగే వారి ప్రాంతాలకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు పనులు కూడా డిమాండ్ చేసి తీసుకువచ్చేందుకు కూడా ఈ ఎంపీల టీమ్ లను ఉపయోగించుకోన్నారు. ఈ ప్రెషర్ గ్రూప్ లను ఏపీ నుంచి జగన్ మోహన్ రెడ్డి డైరెక్ట్ గా మోనిటరింగ్ చేస్తారట. వారికి సలహా సూచనలు అవీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి ఇస్తారట. మొత్తానికి చూసుకుంటే జగన్ మోహన్ రెడ్డి కొత్త విధానం బాగానే ఉన్నట్లుగా ఉంది. కంటిన్యూగా ఎంపీలు వత్తిడి తెస్తే కొంతవరకైనా లాభం ఉంటుందని అంటున్నారు. సీఎం ఢిల్లీ వెళ్ళి రావడం వల్ల మీడియాకు ఫోటోలు తప్ప మరేం ఉపయోగం ఉండదని అంటున్నారు.

Related Posts