యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శనివారం ఉదయం కాలినడకల తిరుమల చేరుకున్నారు. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి భక్తులుకు సేవ చేసుకునే భాగ్యం కల్పించిన సియం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. హిందూ సంప్రదాయం కాపాడుతూ భక్తులు సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సియం ఆదేశించారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలి ఏర్పాటు జరుగుతుందని అయన అన్నారు. గత 5 సంవత్సరాలుగా పాలకమండలి తీసుకున్న వివాదస్పదమైన నిర్ణయాలు పై సమిక్షిస్తాం. బంగారం వివాదాన్ని నిగ్గు తేల్చుతాం, ప్రధాన అర్చకులు తోలగింపు నిర్ణయాని పున:సమిక్షిస్తామని అయన వెల్లడించారు. టిటిడి ఉద్యోగులు సమస్యలును పరిష్కరిస్తామని అయన అన్నారు.