యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పోలవరంపై సీఎం జగన్ వ్యాఖ్యలు అర్థరహితమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కొట్టివేసారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని అయన స్పష్టం చేశారు.
శనివారం అయన మీడియాతో మాట్లాడారు. ఇంజినీరింగ్ నిపుణుల కమిటీ సూచన మేరకే కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టామన్నారు. నిబంధనల మేరకే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. 60 శాతం అప్పర్ కాపర్ డ్యాం పూర్తయిందని పేర్కొన్నారు. పోలవరం పనులపై ఆడిట్ చేస్తామన్న జగన్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు చెప్పారు. తమ మీద కోపాన్ని ప్రాజెక్టుపై ప్రదర్శించొద్దని, ప్రాజెక్టు నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని దేవినేని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ వెళడాన్ని ఉమ తప్పుపట్టారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్కు వ్యతిరేకంగా జగన్ మాట్లాడారు. ఇప్పుడేమో పోలవరంలో కన్నా కాళేశ్వరంలోనే జగన్ ఎక్కువ సేపు గడిపారని విమర్శించారు.