యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఈ నెల 24 న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి అభినందన, ఆత్మీయ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం అయన రూరల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నగరంలో ఇంతకుముందు ఎవరూ చేయని విధంగా మంత్రి కి ఆత్మీయ ర్యాలీ నిర్వహిస్తాం. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఎవరూ చేయని విధంగా మంత్రి పదవులకు సామాజిక న్యాయం చేశారు. నెల్లూరు చరిత్ర లో బిసి సామాజిక వర్గానికి మంత్రి పదవి రావడం ఆనందంగా ఉందని అన్నారు. జిల్లాలో సాగు, తాగు నీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కృషి చేస్తారని అయన అన్నారు.