యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఇంజినీరింగ్ నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. శనివారం జరిగిన ఈ సమావేశానికి జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. భేటీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల అంచనాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ తో పాటు సీఆర్డీఏ ,ఆర్ అండ్ బీ ,మున్సిపల్ శాఖలోని కాంట్రాక్టులపై అధ్యయనం చేయాలని అయన ఆదేశించారు. అవినీతిని ఆస్కారం లేదన్న సందేశం పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు వెళ్లాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అవినీతిని సహించేది లేదని స్పష్టం చేసారు. రివర్స్ టెండరింగ్ ఎక్కడ చేయగలమో గుర్తించాలన్నారు. పోలవరంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్కు ఎక్కడ అవకాశం ఉందో గుర్తించాలన్నారు. ప్రాజెక్టుల వారీగా వివరాలతో వచ్చే సమావేశానికి రావాలని సూచించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో గత ప్రభుత్వంలో జరిగిన పనులపై పునఃసమీక్షకు ఇంజినీరింగ్ నిపుణులతో ప్రభుత్వం కమిటీ నియమించిన సంగతి తెలిసిందే.ది. మరో పదిహేను రోజుల్లో మళ్లీ నిపుణుల కమిటీతో సమావేశం అవుతారు.