యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతి అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల్లో ముస్లింలకు అత్యధిక స్థానాలు కేటాయించడమే కాకుండా మంత్రి పదవిని కూడా ఇవ్వడం ఆయనకు ముస్లింల పట్ల ఎంత ప్రేమను రాగాలు ఉన్నాయనే విషయం ముస్లిం సోదరులకు అర్థమైందన్నారు. హిందూపురం లో ఏర్పాటు చేసిన హజ్ యాత్రికుల అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా అయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాయితీ అధికారి ఇక్బాల్ ఓడిపోయినా ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన ఘనత వైయస్ జగన్ కే దక్కిందన్నారు. ముస్లింలు తమతో ఉండడంతోనే జిల్లాలో ఏకంగా 12 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ స్థానాలు గెలిచామని ఆయన పేర్కొన్నారు. బెంగళూరు నుండి రోడ్డు మార్గం గా వస్తున్నప్పుడు ఎంపీ మాధవ్ కు కొడికొండ చెక్ పోస్ట్ నుండి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కొంతమంది ప్రజలు వీరాపురం సైబీరియన్ పక్షులు విడిది చేసే ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో దేశ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ఆయనకు చేశారు. దీనిపై ఎంపీ మాట్లాడుతూ ఈ విషయమై సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపి, తన వంతు పూర్తిస్థాయిలో కేంద్ర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే జిల్లాలో పూర్తి వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు ఐదేళ్లుగా పూర్తిగా నష్టపోవడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు. రైతులు కనీసం ఉన్న చెరువులకు నీరు నింపేందుకు కృషి చేయాలని కోరినట్లు ఎంపీ తెలిపారు