YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజావేదిక చంద్రబాబు తాత ఆస్థి కాదు

 ప్రజావేదిక చంద్రబాబు తాత ఆస్థి కాదు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

 ప్రభుత్వ ధనంతో నిర్మించిన ప్రజావేదిక తమదంటూ టీడీపీ నేతలు గొడవ చేయడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు కొత్త ప్రభుత్వానికి వెళ్తానన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. ఈ నెల 24న ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫిరెన్స్‌ నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం ఆ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదికలో సమావేశాలు నిర్వహించొద్దని టీడీపీ నేతలు అనడం సరికాదన్నారు. అది చంద్రబాబు డబ్బులతోనో లేక ఆయన తాత ఆస్తులతోనో కట్టింది కాదన్నారు. ప్రజావేదికపై అధికారులతో టీడీపీ నేతలు గొడవ పెట్టుకోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. అధికారులపై దాడులు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related Posts