యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కలెక్టర్ల సమావేశం కచ్చితంగా ప్రజావేదికలోనే నిర్వహించి తీరుతామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.ప్రజావేదికను ప్రభుత్వానికి అప్పజెప్పమని నోటీసులు ఇచ్చినా టీడీపీ నేతలు ఖాళీ చేయలేదని దేవాదాయశాఖ మంత్రి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదిక ప్రభుత్వ ఆస్తి అని, అక్కడ ప్రజా సమస్యల ఫైళ్లు మాత్రమే ఉండాలన్నారు. అంతేకాని సింగపూర్‌తో ఒప్పందాలు, హెరిటేజ్ ఆస్తుల వివరాలు దాచుకోవడానికి అది చంద్రబాబు ఆస్తి కాదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ సొమ్మును ఆదా చేయాలని చూస్తే.. టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.