Highlights
- కీలక అంశాలపై చర్చలు..
- కుదిపేయనున్న పీఎన్‌బీ స్కాం..
విరామం తర్వాత సోమవారం ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. నెల రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు తిరిగి మొదలయ్యాయి. బడ్జెట్‌పై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. ఈ క్రమంలో దేశాన్ని కుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్టు సమాచారం. ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అలాగే బ్యాంకు రుణాల ఎగవేత దారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టం తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉంది. పీఎన్‌బీకు 12,700 కోట్ల రూపాయలను ఎగవేసి వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. గతంలో విజయ్ మాల్యా కూడా బ్యాంకులకు టోకరా వేసి బ్రిటన్ పారిపోయాడు. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. ఎన్డీయేకు మిత్రపక్షైమెన టీడీపీ కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
హోదా కోసం ఏపీ ఎంపీల నిరసన
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటులో టీడీపీ, వైసీపీ ఎంపీలు నిరసన తెలపనున్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. పార్లమెంటు సమావేశాల్లోగా స్పష్టైమెన హామీ ఇవ్వకుంటే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు.
Second part of the budget session of #Parliament to begin today. pic.twitter.com/3MZoKoDFgC
— ANI (@ANI) March 5, 2018