యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి పక్కనే ఉన్న ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిని స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కళా వెంకట్రావు మాట్లాడుతూ, ప్రజావేదిక అంశాన్ని ప్రభుత్వం వివాదాంగా మార్చిందని ఆరోపించారు. దీన్ని ప్రభుత్వం ఎందుకు వివాదం చేస్తోందో అర్థం కావట్లేదని అన్నారు. ప్రజా అవసరాల దృష్ట్యా ప్రజావేదికను తమకు కేటాయించాలని చంద్రబాబు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రజావేదిక ప్రభుత్వానికి అవసరం ఉందని చెబితే ఏ గొడవా ఉండేది కాదని అన్నారు.