యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం పోలీసు స్టేషన్ ఆవరణలో వేరుశనగ విత్తన కాయల కోసం సోమవారం తెల్లవారుజామున నుంచి రైతులు క్యూ లో బారులు తీరారు. వేరుశనగ కాయలు శనివారం రోజునే అయిపోయాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలపడంతో రైతులంతా ఉసూరుమన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు తమ వైపు కన్నెత్తి కూడా చూడలేదని, విత్తన కాయలు ఇస్తున్నారా..లేదా..అనే కనీస సమాచారం కూడా ఇవ్వలేదంటూ.. రైతులంతా అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. వ్వవసాయ శాఖ అధికారులను రైతులంతా చుట్టుముట్టి నిలదీశారు. లక్కిరెడ్డిపల్లె స్టేషన్ వద్ద రైతులంతా ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్ట్టేషన్ లోకి వ్యవసాయ శాఖ అధికారులు పరుగులు తీశారు.