రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రజల వినతులు తీసుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు తనకు ప్రజావేదిక భవనం కేటాయించాలని కొరడటంతోనే ముఖ్యమంత్రి జగన్ ప్రజావేదికను కూల్చివేస్తున్నరని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు.ఈమేరకు సోమవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రలో ఒక్క సమావేశ మందిరాలు లేకపోవటంతో ప్రైవేట్ హోటళ్ళలో పాలన నిర్వహించమన్నారు.ప్రజల అవసరం కోసం నిర్మించిన ప్రజావేదికను కూల్చటం తెలుగు ప్రజలను అవమనపర్చటమని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదని ముఖ్యమంత్రి జగన్ భావిస్తే అమరావతి,పోలవరం వంటి ప్రాజెక్టులకు పూర్తిస్థాయి అనుమతులు లేకపోవటంతో వాటిని కూల్చివేస్తారా అంటూ జవహర్ ప్రశ్నించారు.కూల్చివేతలో ఉన్న మర్మం ఏమిటో ప్రకటించాలన్నారు.నిజంగా అక్రమ కట్టడాలు నిర్మించిన జగన్ అనుచరులను ఏమీ చేస్తారో తెలపాలన్నారు.కేవలం టీడీపీకి కేటాయించాల్సి వస్తుందనే కక్షతో ప్రజావేదికను కూల్చివేసే చర్యలకు వైకాపా ప్రభుత్వం పునుకుందన్నారు.ఇటువంటి నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని జవహర్ పేర్కొన్నారు.