పశ్చిమగోదావరిజిల్లా వేలేరుపాడులో 2010 సం .లో ప్రమాదవశాత్తు పోలీస్ గన్ పేలి గాయపడిన వారికి జాయింట్ కలెక్టర్ యం వేణుగోపాల్ రెడ్ది గోదావరి సమావేశ మందిరంలో సోమవారం మోనటరీ రిలీఫ్ చెక్కులను అందజేశారు. 2010 సంవత్సరంలో వేలేరుపాడులో ఏర్పాటుచేసిన గన్ ఎగ్జిబిషన్ సందర్భంగా విద్యార్థులకు తుపాకీలపై అవగాహన చేస్తుండగా పోలీస్ చేతిలో ప్రమాదవశాత్తు గన్ పేలిన సంఘటనలో గాయపడిన వారికి, షాక్ కు గురైన వారికి మోనటరీ రిలీఫ్ అందచేయాల్సివుంది. గాయపడిన ఇరువురికి 75 వేలు చొప్పున , షాక్ కు గురైనమరొకరికి 10 వేల రూపాయలు చెల్లించాల్సి వుండగా గుగులోతు నవీన్ కుమార్ కు 50 వేల రూపాయలు, షాక్ కు గురైన గుమ్మాల నాగరాజుకు 5 వేల రూపాయలు గతంలోనే చెల్లించారు. అయితే పురిమెట్ల కిషోర్ కు చెల్లించాల్సిన 75 వేలు, గుగులోతు నవీన్ కు చెల్లించాల్సిన మిగిలిన 25 వేలు, గుమ్మాల నాగరాజుకు మిలిగిన 5 వేల రూపాయల చెక్కులను జిల్లా జాయింట్ కలెక్టర్ సోమవారం అందజేశారు.