YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎపిటిడిసి ఎండి, ఎపిటిఎ సిఇఓగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప్ర‌వీణ్ కుమార్

ఎపిటిడిసి ఎండి, ఎపిటిఎ సిఇఓగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప్ర‌వీణ్ కుమార్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహణా సంచాలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని ఏపీటీడీసీ కార్యాలయంలో  ఉదయం సిటిసిపై సంతకం చేసిన ఆయన అధికారులతో ప్రాథమికంగా సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్ర స్థాయి కలెక్టర్ ల సదస్సు పనులలో బిజీ అయ్యారు. బీహార్ కు చెందిన ప్రవీణ్ కుమార్ 2006  బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి.  తొలి రోజులలో వరంగల్  అసిస్టెంట్ కలెక్టర్ గా,  పెనుగొండ సబ్ కలెక్టర్ గా, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా పనిచేసిన ప్రవీణ్ కుమార్ తదుపరి  విశాఖపట్నంలో తనదైన ముద్రను చూపారు.  2012 నుండి 2014 వరకు జాయింట్ కలెక్టర్ గా, తదుపరి 2016 వరకు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పని చేసిన ప్రవీణ్ అదే  జిల్లాలో 2019 జనవరి వరకు జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించటం విశేషం.  ఎన్నికలకు ముందు వెస్ట్ గోదావరి కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుత బదిలీలలో భాగంగా ఏపీటీడీసీ ఎండిగా వచ్చారు.  ఆంధ్ర ప్రదేశ్ టూరిజం అథారిటీ  సీఈఓగా కూడా ప్రవీణ్ వ్యవహరించ నుండగా,  అటు అధారిటీ, ఇటు కార్పొరేషన్ లకు ఒకే అధికారిని నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం రెండు బాధ్యతలను ప్రవీణ్ కుమార్ కే  అప్పగించింది. ఐఏఎస్ అధికారిగా తన పదవీ కాలంలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న ప్రవీణ్ కుమార్ 2014 అక్టోబర్ లో వచ్చిన  హుదూద్ తుఫాను నేపథ్యంలో చేపట్టిన చర్యలు సర్వత్ర ప్రశంసలు అందుకున్నాయి.  విశాఖ నగరాన్ని పునర్నిర్మించటం లో ఆయన పనితీరు ఎనలేని ది.  సాధారణంగా ఒక ఐఏఎస్ అధికారిని ఒకే ప్రాంతంలో సుదీర్ఘ కాలం ఉంచటం అరుదు.  కానీ ప్రవీణ్ పనితీరును మెచ్చిన ప్రభుత్వం వరుసగా ఏడు సంవత్సరాలు విశాఖపట్నం లోనే వివిధ హోదాలలో  సేవలు అందించే అవకాశం  కనిపించింది. తన పదవీ కాలంలో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ నుండి విశాఖలో లెడ్ లైట్లు ఏర్పాటుకు సంబంధించి రెండు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు .  దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 20 స్మార్ట్ సిటీ లను ఎంపిక చేయగా విశాఖకు వాటిలో స్థానం దక్కింది అంటే అది ప్రవీణ్ కుమార్ ప్రతిభకు నిదర్శనమే.  స్వచ్ఛ భారత్ లో భాగంగా విశాఖ నగరానికి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు  లభించటం వెనుక నాటి కలెక్టర్ గా  ప్రవీణ్ కృషి ఎంతో ఉంది. నిరుపేదలకు అండగా 62 వేల మందికి పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసినా,  పనికి ఆహార పథకంను విశాఖ జిల్లాలో పటిష్టంగా అమలు చేయగలిగిన అది ప్రవీణ్ కుమార్ వల్లే సాధ్యమైంది.  పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహణ సంచాలకులుగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక రంగం విశాఖ చుట్టుపక్కలే కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో సుదీర్ఘ కాలం తాను అక్కడే పని చేయడం కూడా ప్రస్తుత ప్రయాణానికి ఉపకరిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీటీడీసీ ఈడి కుమార్, శ్రీదేవి, విశ్వనాధం, ఏపిటిఏ అధికారులు సాంబశివ రాజు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  

Related Posts