YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విష్ణుకు మళ్లీ ఉడా ఛైర్మన్ గిరా...

 విష్ణుకు మళ్లీ ఉడా ఛైర్మన్ గిరా...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మ‌ల్లాది విష్ణు విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిగా గుర్తింపు సాధించారు. కాంగ్రెస్‌లో ఉండ‌గా.. వైఎస్ ఆశీర్వాదంతో టికెట్ పొందిన ఆయ‌న 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టికెట్‌పై విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. 2014లో రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో చాలా మంది సీనియ‌ర్లు పార్టీ మారిన‌ప్ప‌టికీ.. మ‌ల్లాది విష్ణు మాత్రం కాంగ్రెస్‌లోనే కొన‌సాగారు. అదే ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో నుంచి పోటీ చేసిన ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత విజ‌య‌వాడ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా కీలక బాధ్య‌త‌లు చేప‌ట్టారు. రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్న మ‌ల్లాది.. తర్వాత కాలంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జ‌గ‌న్‌కు స‌న్నిహితుల్లో ఒక‌రుగా మారారు. డిబేట్ల‌లోనూ వైసీపీకి అనుకూలంగా మంచి గ‌ళం వినిపించారు.దీంతో జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు సంపాయించుకున్నారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. కేవ‌లం 25 ఓట్ల మెజారిటీతోనే ఆయ‌న విజ‌యం సాధించినా.. ఇది చారిత్రాత్మ‌కంగా నిలిచిపోయింది. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి బ‌ల‌మైన టీడీపీ అభ్య‌ర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమాను ఓడించారు. ఆది నుంచి కూడా ఈ ఇద్దిరి మ‌ధ్య విజ‌యం దోబూచులాడింది. ఒకానొక ద‌శ‌లో బొండా ఉమా పైచేయి సాధించారు. త‌ర్వాత రౌండ్ల‌లో మ‌ల్లాది విష్ణు పైచేయి ప్రద‌ర్శించారు. ఇలా చిట్ట చివ‌ర‌కు 25 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు.మ‌రోప‌క్క ఇదే టికెట్‌ను వైసీపీ మ‌రో నాయ‌కుడు, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క నేత వంగ‌వీటి రంగా వార‌సుడు వంగ‌వీటి రాధా ఆశించారు. దాదాపు ఎనిమిదేళ్లుగా తాను వైసీపీలోనే ఉండి పార్టీకి కృషి చేశాన‌ని పెద్ద ఎత్తున జ‌గ‌న్‌పై ఒత్తిడి తెచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మాత్రం.. ఇదే సీటును ఆశించిన బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లాది విష్ణు ప‌క్షానే నిలిచారు. త‌న‌పై కాపు వ‌ర్గం నుంచి ఎంత‌టి ఒత్తిళ్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మాత్రం ఈ సీటును మ‌ల్లాదికే కేటాయించారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం రాధా ఎన్నిక‌కు ఓ నియోజ‌క‌వ‌ర్గం మారుతుండ‌డ‌మే. దీనికి తోడు పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న ప్ర‌జాపోరాటాలు చేయ‌డం కాని.. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం కాని చేయ‌లేదు. జ‌గ‌న్ మ‌ల్లాది విష్ణు కి సీటు కేటాయించారు. ఇక్క‌డ మ‌రో ఈక్వేష‌న్ కూడా ఉంది. ఏపీలో ఎక్క‌డా లేని విధంగా సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 45 వేల బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గ ఓట‌ర్లు ఉన్నారు. దీంతో క్యాస్ట్ ఈక్వేష‌న్ల ప‌రంగా అదే వ‌ర్గంలో ప‌ట్టున్న విష్ణుకు జ‌గ‌న్ సీటు కేటాయించారు. త‌నపై ఉంచిన విశ్వాసాన్ని వ‌మ్ము చేయ‌కుండా గెలిపించాల‌ని నిర్ణ‌యించుకున్న విష్ణు అదే రేంజులో కష్ట‌ప‌డ్డారు. ఎన్నిక‌ల్లో గెలిచి.. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని జ‌గ‌న్‌కు కానుక‌గా అందించారు. అయితే, ఇప్పుడు మ‌ల్లాది ఫ్యూచ‌ర్ ఎంటి? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. గ‌తంలో వైఎస్ హ‌యాంలో మ‌ల్లాదికి విజ‌య‌వాడ, గుంటూరు, తెనాలి, మంగ‌ళ‌గిరి అర్బ‌న్ అభివృద్ధి అధారిటీ(వీజీఎంటీ) చైర్మ‌న్ ప‌ద‌విని అప్ప‌గించారు.ఇప్పుడు కూడా జ‌గ‌న్ ఇదే ప‌ద‌విని త‌న‌కు అప్ప‌గిస్తార‌నే ఆశ‌తో మ‌ల్లాది ఉన్న‌ట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. అక్క‌డ తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆధారిటీ(తుడా) చైర్మ‌న్ ప‌ద‌విని పార్టీలో సీనియ‌ర్, చంద్ర‌గిరి నుంచి వ‌రుస విజ‌యాలు సాధించిన చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డికి అప్ప‌గించారు. జ‌గ‌న్ పార్టీలో చాలా మంది సీనియ‌ర్లు గెల‌వ‌డంతో వారికి అనేక ప‌ద‌వులు ఇస్తున్నారు. చెవిరెడ్డికి తుడా, రోజాకు ఏపీఐఐసీ లాంటి ప‌ద‌వులు ఇచ్చారు. ఇక చెవిరెడ్డి గ‌తంలో చేప‌ట్టిన తుడా చైర్మ‌న్ ఇప్పుడు తిరిగి ఆయ‌న‌కు ఇచ్చిన‌ట్టే విష్ణు కూడా వీజీఎంటీ చైర్మ‌న్ ప‌ద‌విని త‌న‌కు అప్ప‌గిస్తార‌ని ఆశ‌లు పెట్టుకున్నారు మ‌ల్లాది విష్ణు. మ‌ల్లాది సీనియార్టీ దృష్ట్యా ఆయ‌న‌కు ఖ‌చ్చితంగా ఏదో ఒక ప‌ద‌వి అయితే రావ‌డం ఖాయం. మ‌రి జ‌గ‌న్ మ‌దిలో ఏముందో? విష్ణు ఫ్యూచ‌ర్ ఏంటో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Related Posts