YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలులో ఎలుగుబంటి హల్‌చల్.. చెట్టెక్కి ముప్పుతిప్పలు

 కర్నూలులో ఎలుగుబంటి హల్‌చల్.. చెట్టెక్కి ముప్పుతిప్పలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఎలుగుబంట్ల కలకలం పెరిగిపోయింది. తాజాగా మరోసారి కర్నూలు జిల్లాలో ఎలుగుబంటి వీరవిహారం చేస్తోంది. ఉదయం పొలాల్లో రైతులకు కనిపించిన ఎలుగుబంటి వారిని భయబ్రాంతులకు గురి చేసింది. ఎంత తరిమినా వెళ్లకుండా అక్కడ తిష్టవేసుకొని కూర్చొంది. కాసేపటికి అక్కడున్న ఓ చెట్టు ఎక్కి కూర్చొంది. దీంతో చివరికి రైతులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎలుగుబంటిని చెట్టు నుంచి దించేందుకు ఫారెస్ట్ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపు.. ఎలుగుబంటి చెట్టెక్కిన వార్త ఆనోటఈనోట పాకడంతో దాన్ని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. దీంతో పెద్దఎత్తున జనాన్ని చూసిన ఎలుగు వణికిపోయి.. చెట్టు దిగడం లేదు.మరోవైపు ఎలుగుకు మత్తు ఇవ్వడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.కర్నూలు శివార్లలో SNR డిగ్రీ కాలేజ్ వద్ద ఎలుగుబంటి హల్చల్ చేస్తుంది. కాలేజీ ప్రాంగణంలో చెట్టుమీదికి ఎక్కి కూర్చోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.ఘటన స్థలానికి అటవీ, పోలీస్ అధికారులు చేరుకొని బోన్ లో బంధించి పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.గతంలో కూడా కర్నూలు జిల్లా వెలుగోడు తెలుగు గంగ రిజర్వాయర్లో ఎలుగుబంటి ప్రమాదవశాత్తు పడిపోయింది. దీంతో నీటిలో పడ్డ ఎలుగుబంటిని రక్షించేందుకు ఫారెస్ట్ అధికారులతో పాటు పెద్ద ఎత్తున జనం అక్కడకు చేరుకున్నారు. వలలు, తాళ్లు వేస్తూ... ఎలుగును రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే జనం అరుపులు, కేకలు విన్న ఎలుగుబంటి బెదిరిపోయింది. తనను కాపాడుతున్నవారిపైనే దాడి చేసింది.ఎలుగుబంటి దాడిలో ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి.

Related Posts