యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కాల్ మనీ లాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏ పార్టీవారు ఉన్నా విడిచిపెట్టొద్దని పోలీసు అధికారులకు ఆదేశించారు. బుధవారం అయన రాష్ట్ర స్థాయి పోలీసులు సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను క్లీన్చేయాలని అయన ఆదేశించారు. ఎవరికైనా ఫిర్యాదు ఉంటే వెంటనే తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే, కాలుష్యానికి స్పందించి నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు అయన అన్నారు. కఠినమైన, కచ్చితమైన విధానాన్ని తీసుకురావాలి. జవాబుదారీ తనం ఉండాలని అయన ఆదేశించారు. కాలుష్యంతో సమాజానికి చేటు తెచ్చే వాటిపై దృష్టిపెట్టాలి. కాలుష్యంపై నిఘా పెంచాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలి. ప్రజల అభ్యంతరాలను తోసిపుచ్చి, బుల్డోజ్ చేసే పద్దతి వద్దని అధికారులకు ఆదేశించారు. కాలుష్యంపై ఎవరు అభ్యంతరం వ్యక్తంచేసినా దానిపై సానుకూల పరిశీలన చేయాలని జగన్ అన్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపట్ల అప్రమత్తతో ఉండాలి. భవిష్యత్ తరాలకు చేటు తెచ్చే పరిస్థితి ఉండకూడదని అయన అన్నారు.
రాష్ట్రంలో అక్టోబరు 1 నాటికి బెల్టుషాపులు పూర్తిగా ఎత్తివేయాల్సిందని అయన అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలకు సీఎం ఆదేశించారు. సమాజానికి మంచే చేసే నిర్ణయాల అమల్లో అడుగులు ముందుకు పడాల్సిందే. జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు వద్దు. దాబాల్లో లిక్కర్ అమ్మకుండా చూడాలని అచప అన్నారు. రోడ్ సేఫ్టీపై అవగాహన కలిగించాలి. రోడ్ల నియమాలపై హోర్డింగ్లు పెట్టించాలి. జరిమానాలు విధించే ముందు అవగాహనకు పెద్దపీట వేయాలని అయన సూచించారు. ఎటువైపు నుంచి ఓవర్టేక్ చేయాలన్నదానిపై సూచనలు చేసేలా హోర్డింగ్స్ పెట్టించాలి. విజయవాడలో ట్రాఫిక్ సమస్యపై కుడా సీఎం దృష్టి సారించారు. సరైన ప్రణాళిక రూపొందించాలి.దీనిపై అధికారులతో సమావేశం ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు.
ఉభయ గోదావరి జిల్లాలో తాగునీరు పూర్తిగా కలుషితం అయ్యింది పాదయాత్రలో నేను ప్రజల కష్టాలు చూశాను. తాగునీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. ధవలేశ్వరం నుంచి పైపులైన్ ద్వారా నీటిని తీసుకుని ప్రతిగ్రామంలో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు దీనిపై కలిసి కూర్చోవాలని జగన్ సూచించారు.