రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం ఉంది. ఆంధ్రా ఒడిశా బోర్డర్ లో మావోయిస్టుల సమస్య ఉంది. రక్షణ విషయంలో పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. బుధవారం ప్రజావేదికలో జరుగుతున్న కలెక్టర్ల భేటీలో అయన మాట్లాడారు. కుల,మతాల మధ్య గొడవలు కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. రాయలసీమ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల తర్వాత రాజకీయ గొడవలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య గతేడాది గణనీయంగా తగ్గిందని అయన అన్నారు. ఈ ఏడాది వైట్ కాలర్ నేరాల సంఖ్య బాగా పెరిగింది. 2018లో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 1,22,268 అని అయన అన్నారు. ఆస్తుల కేసుల్లో విజయవాడ, తూర్పుగోదావరి అగ్రస్థానం వుండగా, గుంటూరు రూరల్ ప్రాంతాల్లో దాడులు కేసులు ఎక్కువని అయన అన్నారు. 880 మర్డర్ కేసులు గత ఏడాది నమోదు అయ్యాయి. ఆర్ధిక నేరాల్లో పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయవాడ లో ఎక్కువ వున్నాయి. మహిళల పై నేరాలు గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో ఎక్కువ నమోదు అయ్యాయని అయన వెల్లడించారు.